E-Paper
Advertisement

300 సినిమాలు ..నాలో ఏ లోపం ఉంది..అవకాశాలు లేకపోవడం పై సుమన్ శెట్టి ఎమోషనల్

300 సినిమాలు ..నాలో ఏ లోపం ఉంది..అవకాశాలు లేకపోవడం పై సుమన్ శెట్టి ఎమోషనల్
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈవారం ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి (Suman Shetty) పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలలో అవకాశాలు రాకపోవడం గురించి కూడా ఈ సందర్భంగా సుమన్ శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నెలకు 30 రోజులు పని చేశాను..

సుమన్ శెట్టి టాలీవుడ్ కమెడియన్ గా కొన్ని వందల సినిమాలలో నటించారు. సుమారు 300 సినిమాలలో నటించిన ఈయనకు ఇటీవల సినిమా అవకాశాలు లేకపోవడం గమనార్హం. అయితే ఎందుకని మీకు సినిమాలలో అవకాశాలు రావడం లేదు అంటూ వర్ష ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సుమన్ శెట్టి సమాధానం చెబుతూ.. సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకానొక సమయంలో నెలకు 30 రోజులు ఉంటే ఆ 30 రోజులు కూడా నేను షూటింగ్ చేశాను.. నాకు ఒక నంది అవార్డు కూడా వచ్చిందని సుమన్ శెట్టి తెలిపారు.

సినిమాలు తప్ప నాకేం తెలియదు..

Advertisement

సినిమాలలో నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. అయితే అవకాశాలు లేకనే గ్యాప్ వచ్చిందని తెలిపారు. నాకు కాళ్లు, చేతులలో ఫ్యాక్చర్ అయ్యాయి. నాలో ఉన్న లోపం ఏంటి? ఎందుకు నాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి?ఏ క్యారెక్టర్ అయితే నాకు ఇస్తున్నారో ఆ క్యారెక్టర్ లేని సరిగా చేయడం లేదా? నాకు సినిమా షూటింగ్ తప్ప ఇంకోటి తెలియదు.. రాదు…అందుకే నేను చాలా బాధపడుతున్నాను అంటూ తనకు సినిమా అవకాశాలు లేకపోవడం గురించి సుమన్ శెట్టి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించిన కమెడియన్ కు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇలా అవకాశాలు లేకపోవడంతో సుమన్ శెట్టి ఎంత ఆవేదన చెందుతున్నారు అనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు మరి ఇప్పుడైనా ఈయనని గుర్తించి దర్శకులు ఎవరైనా తనకు సినిమా అవకాశాలు ఇస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన ఫ్యామిలీ గురించి అలాగే ఇటీవల కామెడీ పేరుతో ఇతరులను కించపరుస్తున్న సంఘటనల గురించి కూడా సుమన్ శెట్టి తన అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే ఇటీవల పలువురు సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరుతో పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. ఈ అంశం గురించి కూడా సుమన్ శెట్టికి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వీటన్నింటికీ ఈయన ఏ విధమైనటువంటి సమాధానం ఇచ్చారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Also Read: లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ లో ఎక్స్ ప్రెస్ హరి..రోడ్ల పై పిచ్చోడిలా తిరిగా అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×