E-Paper
Advertisement

ఖైదీలకు చుక్కలు చూపించే పాత ఇల్లు… దెయ్యాల రివేంజ్ తో దద్దరిల్లే ఆ రాత్రి

ఖైదీలకు చుక్కలు చూపించే పాత ఇల్లు…  దెయ్యాల రివేంజ్ తో దద్దరిల్లే ఆ రాత్రి
Advertisement

Horror Thriller OTT : రీసెంట్ గా ఒక సూపర్ నేచురల్ హారర్ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను బాగా భయపెడుతోంది. క్షుద్ర పూజలు, ప్రతీకారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో గ్రాఫిక్స్ కంటే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్, మేకప్‌తోనే భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా, ఎందుకంటే ఇందులో హింస, బూతులు ఎక్కువగా ఉంటాయి. హారర్ సినిమాల్లో ఒక వెరైటీ బ్లాక్ మ్యాజిక్ నేపథ్యం కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘బ్యాడ్ వూడూ’ (Bad Voodoo). దీనికి ఆండ్రూ అడ్లెర్, ఆండ్రే హెప్బర్న్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాత కాలపు హారర్ సినిమాల స్టైల్‌లో కనిపించేలా 16mm ఫిలిం మీద షూట్ చేశారు. అందుకే విజువల్స్ కాస్త రఫ్‌గా ఉండి భయాన్ని కలిగిస్తాయి. ఇందులో జాన్ ఫియోర్, మ్యానీ పెరెజ్ లాంటి సీనియర్ నటులు నటించగా, డెస్క్‌పాప్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ దీనిని డిస్ట్రబ్యూట్ చేసింది. కేవలం ఒకటిన్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమా, తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ ఇందులోని మేకప్, వింత శబ్దాలు ప్రేక్షకులను వణికించేలా ఉంటాయి. 2026 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం Apple TV, Prime Video వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జైలు నుంచి తప్పించుకున్న నలుగురు దొంగలు, పోలీసుల కళ్లు గప్పి దాక్కోవడానికి ఒక ఊరు చివర ఉన్న పాత ఇంటిలోకి చొరబడతారు. అక్కడ అబిగైల్ అనే ఒక మహిళ నోరు మూసి బందీగా చేసుకుంటారు. హాయిగా ఇక్కడ దాక్కుని, తెల్లారాక చెక్కేద్దాం అని ఆ దొంగలు ప్లాన్ వేస్తారు. కానీ ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదని, అక్కడ చావు కేకలు వినిపిస్తాయని వాళ్లకి అప్పుడు తెలీదు. తీరా చూస్తే, ఆ అబిగైల్ దంపతులు తమ బిడ్డల చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ‘వూడూ’ అనే భయంకరమైన క్షుద్ర పూజలు చేసి దయ్యాలను తమ అధీనంలో ఉంచుకుని ఉంటారు.

ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఈ దొంగలకి ఒక్కొక్కడికి చుక్కలు కనిపిస్తాయి. ఆత్మలు వీళ్లని వేటాడటం మొదలుపెడతాయి. తప్పించుకుందామన్నా దారి దొరకదు, దాక్కుందామన్నా చావు వదలదు. లోపలికి వెళ్లిన ఆ నలుగురు దొంగలు ఆ క్షుద్ర శక్తుల చేతిలో నలిగిపోతారు. రక్తం కూడా ఏరులై పారుతుంది. చివరికి ఆ ఇంట్లో నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా ? ఆ వూడూ శక్తులకు బలైపోతారా ? అన్నది సినిమా చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

Advertisement

Read Also : పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×