E-Paper
Advertisement

Big tv Kissik Talks:  సీరియల్ వాళ్ళు అందుకే సినిమాలు చెయ్యరు… కమిట్మెంట్ పై శ్రీ వాణి షాకింగ్ కామెంట్స్!

Big tv Kissik Talks:  సీరియల్ వాళ్ళు అందుకే సినిమాలు చెయ్యరు… కమిట్మెంట్ పై శ్రీ వాణి షాకింగ్ కామెంట్స్!
Advertisement

Big tv Kissik Talks:  సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యంగా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందంటూ ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే బహిరంగంగా మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చాలామంది హీరోయిన్స్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి తాజాగా సీరియల్ నటి శ్రీవాణి (Sreevani)మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రీవాణి తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె కెరియర్ కి సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

సీరియల్ వాళ్ళు సినిమాలు అందుకే చేయరా..

సాధారణంగా సీరియల్స్ చేసే వాళ్లకు పెద్దగా సినిమా అవకాశాలు రావు. ఇక సీరియల్స్ నటీనటులు కూడా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపించరు ఇలా ఎందుకు సినిమాలలో నటించరు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శ్రీవాణి సమాధానం చెబుతూ సీరియల్ ఆర్టిస్టులు ఒక సీరియల్ కు కమిట్ అయితే సంవత్సరాలపాటు ఆ సీరియల్ కొనసాగుతుంది అలాగే సినిమాలలో చేసాము అంటే వారి పాత్ర కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కొన్నిసార్లు షూటింగ్ చేసిన తరువాత మన పాత్రలను తొలగిస్తూ ఉంటారు. అదేవిధంగా సినిమాల కోసం డేట్స్ ఇవ్వటం సీరియల్స్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల కూడా చాలామంది సినిమాలలో నటించడానికి ఇష్టపడరని శ్రీవాణి తెలిపారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది..కానీ

Advertisement

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో శ్రీవాణి మాట్లాడుతూ తాను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. తాను సీరియల్స్ లో చేశాను షోస్ చేశాను, హోస్ట్ గా చేశాను కానీ నాకు ఎక్కడ ఏలాంటి ఇబ్బందులు ఎదురవలేదని తెలిపారు. అలాంటి ఇబ్బందులే ఉంటే నా కూతురిని కూడా ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకు వస్తాను అంటూ ప్రశ్నించారు. పూర్తిగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పను కానీ ,అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు వారిని మాత్రమే నిందించాలి తప్ప ఇండస్ట్రీని మొత్తం నిందించకూడదని తెలిపారు.

Advertisement

మరొక విషయం ఏమిటంటే బయట సమాజంతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు చాలా తక్కువ అంటూ మాట్లాడారు. ఇక ఇండస్ట్రీలో కూడా ఎవరైనా కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే అది పూర్తిగా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని శ్రీవాణి ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులే ఉంటే మా ఫ్యామిలీలో కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకోరు కదా.. మా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు మా పాపను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాము. అలాంటి ఇబ్బందులే ఉంటే మేమెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు.

Also Read: Big tv Kissik Talks: పెళ్లి విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఉంది..ముందు ఆపని చేయమన్న శ్రీవాణి!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×