E-Paper
Advertisement

Chloe Tryon Engagement: ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న ద‌క్షిణాఫ్రికా మహిళా క్రికెటర్

Chloe Tryon Engagement: ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న ద‌క్షిణాఫ్రికా మహిళా క్రికెటర్
Advertisement

Chloe Tryon Engagement: క్రికెట్ లో.. ముఖ్యంగా మహిళా క్రికెట్ లో ఇటీవల స్వలింగ వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్, అర్జెంటీనా, జర్మనీ, మెక్సికో, యూకే, అమెరికా, తైవాన్, బెల్జియం, కెనడా.. ఇలా చాలా దేశాలలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం కావడంతో.. మహిళా క్రికెటర్లు ఒకరినొకరు వివాహం చేసుకోవడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఆచారాన్ని మొదట సమాజం అంగీకరించలేదు.

Also Read: Smriti Mandhana-Palash: స్మృతి మందాన పెళ్లిలో ట్విస్ట్.. దిష్టి తగలకుండా ఏం ప్లాన్ చేసారురా.. ఏకంగా ఆ సింబల్ పెట్టి మరి

Advertisement

అంతేకాకుండా దీనిపై విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రపంచం ముందుకు సాగుతున్నా కొద్ది, ప్రజలు మరింత విశాల దృక్పథం కలిగి ఇతరుల భావాలకు సున్నితంగా మారుతున్నారు. దీంతో ఈ స్వలింగ వివాహాలకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చట్టబద్ధంగా ఆమోదించబడుతుంది. ఈ స్వలింగ వివాహాలను పలు దేశాలు చట్టబద్ధం చేయడం ద్వారా క్రీడాకారిణులు తమ సంబంధాలను బహిరంగంగా ప్రకటించడానికి ఎక్కువగా స్వేచ్ఛ పొందారు. అలాగే ఇలాంటి వివాహాలకు ఇతర ప్రముఖ క్రికెటర్లు కూడా హాజరు కావడం ఈ ధోరణికి నిదర్శనం.

ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్:

దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ లో ట్రైయాన్ తన భాగస్వామి మిషెల్ నటివెల్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రైయాన్ 2025 నవంబర్ 29న తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ శుభవార్తను, నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. క్లో ట్రైయాన్ మోకాలిపై కూర్చొని రింగ్ అందించి నటివెల్ కి ప్రపోజ్ చేసింది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ జంటకి అభిమానులు, వారితోటి క్రీడాకారిణుల నుండి వారికి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మిషెల్ నటివెల్ జింబాబ్వేకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ అలాగే కొరియోగ్రాఫర్ మరియు వీడియో గ్రాఫర్.

క్రికెట్ లో ఇప్పటివరకు జరిగిన స్వలింగ వివాహాలు:

Advertisement

కేట్ క్రాస్, ఇసా గుహా: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇసా గుహా, ఇంగ్లాండ్ మహిళల జట్టు ప్రస్తుత సభ్యురాలు కేట్ క్రాస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.

నాట్ స్కివర్-బ్రంట్, కేథరీన్ స్కివర్-బ్రంట్: ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఇద్దరు స్టార్ ఆల్ రౌండర్లు 2022లో వివాహం చేసుకున్నారు. వీరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టుకు ఆడుతూ వివాహం చేసుకున్న మొదటి జంటగా నిలిచారు.

అమీ సాటర్త్‌వైట్, లీ తహుహు: న్యూజిలాండ్ మహిళా జట్టుకు చెందిన ఈ ఇద్దరు క్రికెటర్లు వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు కూడా ఉన్నారు.

మార్రీజాన్ కాప్, డాని వాన్ నీకెర్క్: దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఇద్దరు ముఖ్యమైన ఆల్ రౌండర్లు 2018లో వివాహం చేసుకున్నారు.

Also Read: Ind vs Sa 1st Odi: నేడే తొలి వన్డే.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరంటే.. మ్యాచ్ టైమింగ్స్, ఫ్రీగా చూడాలంటే

ఇక మనదేశంలో కూడా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ 2023 లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఆ సమయంలోనే ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ లో 3-2 మెజారిటీతో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ ద్వారా నిర్ణయం జరగాలని తేల్చి చెప్పింది. ఇక ఈ ఏడాది 2025 జనవరి 9న మరోసారి రివ్యూ పిటిషన్ ని దాఖలు చేయడంతో సుప్రీం దానిని తిరస్కరించింది.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×