E-Paper
Advertisement

Big tv kissik talks promo: ఆ క్షణం చచ్చిపోయాను .. అంత ఈజీగా మర్చిపోలేము.. దివి ఎమోషనల్

Big tv kissik talks promo: ఆ క్షణం చచ్చిపోయాను .. అంత ఈజీగా మర్చిపోలేము.. దివి ఎమోషనల్
Advertisement

Big TV Kissik talks Promo: సినీ ఇండస్ట్రీలో నటిగా, మోడల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివి ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమాలపై మక్కువతో దివి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం లెట్స్ గో అనే షార్ట్ ఫిలిం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాతో వెండితెరపై సందడి చేసిన దివి ప్రస్తుతం కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లలోను సందడి చేస్తున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

బ్రేకప్ భరించలేని బాధ..

తాజాగా దివి బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా ఈమె సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు గురించి అలాగే లవ్ బ్రేకప్ గురించి కూడా మాట్లాడారు. మీ జీవితంలో ఏదైనా మళ్లీ ఇది రాకూడదనేది ఏదైనా ఉందా అంటూ వర్షా అడగడంతోదివి మాట్లాడుతూ నా జీవితంలో లవ్ వర్కౌట్ కాలేదేమో అంటూ బ్రేకప్ స్టోరీ బయట పెట్టారు. బ్రేకప్ భరించలేని బాధ అని తెలిపారు. ఒక వ్యక్తిని ప్రేమించడం సులువైన విషయం కాదని, ఎప్పుడైతే బ్రేకప్ అయ్యిందో నా లోపల నా మనస్సాక్షి నా మనసు చచ్చిపోయిన భావన కలిగింది.

డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను..

Advertisement

బ్రేకప్ అయిన వారు చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు నేను కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, అది కామన్ అని తెలిపారు. లవ్ అనేది 2-3 ఇయర్స్ ప్రాసెస్ లో జరుగుతుంది కానీ విడిపోయిన వెంటనే ఎలా మర్చిపోతాం వెంటనే కట్ అవ్వలేము కదా.. చాలా కష్టం అంటూ ఈమె బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈమె ఇదివరకు లవ్ లో ఉండి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి తాను ఎవరితోనూ రిలేషన్ లో లేనని, సింగిల్ అనే విషయాన్ని కూడా దివి ఈ సందర్భంగా బయటపెట్టారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దివి కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి తన అభిమాన నటీనటుల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల విడుదలైన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా గురించి మాట్లాడుతూ శంకర్ దాదా ఎంబిబిఎస్ తర్వాత చిరంజీవి అలాంటి స్వాగ్ తో కనిపించారు అంటూ దివి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈమె అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో రిపోర్టర్ గా కనిపించి సందడి చేశారు. కెరియర్ పరంగా దివి ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Nidhi Agerwal: పెళ్లి ఇంట్రెస్ట్ లేదు కానీ నలుగురు పిల్లలు కావాలంటున్న నటి

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×