E-Paper
Advertisement

Mahesh Babu: “నువ్వే నా జీవితం”.. భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు!

Mahesh Babu: “నువ్వే నా జీవితం”.. భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు!
Advertisement

Mahesh Babu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే జంట మహేష్ బాబు (Mahesh Babu), నమ్రత శిరోద్కర్(Namratha shirodkar). వీరిద్దరూ భార్యాభర్తలుగానే కాకుండా ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈరోజు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా తన భార్య నమ్రత శిరోద్కర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ విషెస్ తెలియజేసి.. ఆమెపై ప్రేమ ఒలకబోశారు. ముఖ్యంగా ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నారు.

భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేసిన మహేష్ బాబు..

తన భార్య నుదుటిపై ప్రేమగా ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ..” హ్యాపీ బర్త్ డే NSG.. మన కుటుంబాన్ని ఇంతటి ప్రేమతో.. గౌరవంతో.. ఒక్కటిగా ఉంచుతున్నందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకంటే నీ నుంచి నేనేమీ కోరుకోలేను.. నువ్వే నా జీవితం” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. తన జీవితంలో నమ్రతా పోషించే పాత్ర ఎంత కీలకమో ఈ ఒక్క పోస్టుతో మరోసారి నిరూపించారు మహేష్ బాబు. మొత్తానికైతే మహేష్ బాబు షేర్ చేసిన ఈ పోస్ట్ పై అభిమానులు భార్యపై మహేష్ బాబుకు ఇంత ప్రేమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు జీవితంలో స్ట్రాంగ్ పిల్లర్ గా నమ్రత..

Advertisement

ఇకపోతే నమ్రత మహేష్ బాబు జీవితంలో ఎంత కీలకపాత్ర పోషిస్తుంది అంటే ఆయన వేసుకునే బట్టలను మొదలుకొని ఆయన నటించే సినిమాల వరకు అలాగే ఆయన బిజినెస్ ల పరంగా అన్నింటిలోనూ నమ్రత ముందుంటుంది.. అటు ఇంటి బాధ్యతలు , ఇటు పిల్లల బాధ్యతలను తీసుకోవడమే కాకుండా మహేష్ బాబు బిజినెస్ డీల్స్ , బ్రాండ్ ఎండార్స్మెంట్ వంటి వాటిని కూడా ఆమె ఒక పర్ఫెక్ట్ మేనేజర్ లా నిర్వహిస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలి అంటే మహేష్ బాబు కెరియర్ లో నమ్రత ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనడంలో సందేహం లేదు.

also read:Peddi: విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న పెద్ది.. ఆ ఒక్క కారణంతో వాయిదా పడుతుందా?

తల్లికి స్పెషల్ విషెస్ తెలియజేసిన పిల్లలు..

Advertisement

మహేష్ బాబు తో పాటు పిల్లలు సితార , గౌతమ్ ఘట్టమనేని కూడా తమ తల్లికి స్పెషల్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం నమృత పుట్టినరోజు కావడంతో అటు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ నమ్రత శిరోద్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మహేష్ బాబు సినిమాలు..

మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా 2027 సమ్మర్ టార్గెట్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులారిటీ అందుకోబోతున్నారు మహేష్ బాబు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×