E-Paper
Advertisement

నమ్మిన వాళ్ళేముంచేశారు…డ్రగ్స్ కేసు పై సంజన ఎమోషనల్!

నమ్మిన వాళ్ళేముంచేశారు…డ్రగ్స్ కేసు పై సంజన ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik talks: సంజన గల్రానీ పరిచయం అవసరంలేని పేరు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ఎన్నో టీవీ కార్యక్రమాలలో కూడా నటించి సందడి చేశారు. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Big Boss 9) కార్యక్రమంలో పాల్గొన్న సంజన ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు తెలుగులో ఈమె ఒక సీరియల్ లో కూడా నటించబోతున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీ అవుతున్న సంచన తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నాపై పడిన నింద పోగొట్టుకోవడానికి..

ముఖ్యంగా గతంలో సంజన డ్రగ్స్ కేసులో(Drugs Case) భాగంగా అరెస్ట్ కావడం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను బిగ్ బాస్ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం నాపై పడిన నింద తొలగించుకోవడానికి వచ్చానని తెలిపారు. ఐదు నెలల పాపని వదిలిపెట్టి తాను వస్తానంటే ఎంతో మంది నన్ను తిట్టారు కానీ నా ఇద్దరు పిల్లలకు 13 మందిని ప్రొటెక్షన్ కోసం పెట్టి హౌస్ లోకి వచ్చి నాపై పడిన నింద పోగొట్టుకోవాలని హౌస్ లోకి వచ్చాను. దాదాపు మూడు నెలలకు పైగా నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను . నాకు ఎలాంటి బాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా సంజన ప్రశ్నించారు.

నా కన్నీళ్లు దిండుకు మాత్రమే తెలుసు..

Advertisement

డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం గురించి మాట్లాడుతూ అది చాలా భయంకరమైన పరిస్థితి అని తెలిపారు. నేను బాగా నమ్మిన వాళ్లే, నా స్నేహితులే నన్ను ముంచేసారని, అప్పటినుంచి మనుషులపై తనకు నమ్మకం లేకుండా పోయిందని సంజన తెలిపారు. తాను కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండటం చూసి ఓర్వలేక కుట్ర చేసి మరి నన్ను ఈ కేసులో ఇరికించారని సంజన తెలిపారు. చేయని తప్పుకు తనపై నిందలు వేశారు. ఆ సమయంలో నేను ఎంత ఏడ్చానో నా దిండుకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నిద్ర పట్టేది కాదు నేను ఏడ్చి ఏడ్చి నా దిండు మొత్తం తడిసిపోయేదని నా కన్నీళ్లు నా దిండుకు మాత్రమే తెలుసు అంటూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇలాంటి పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు నన్ను ఈ విషయంలో బలి పశువును చేశారని, చావు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చానని సంజన తెలిపారు. డ్రగ్స్ కేసు సమయంలో తాను సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను కానీ నా తప్పు లేదని నిరూపించుకోవాలని అందుకే ఆత్మహత్య ఆలోచన కూడా మానుకున్నానని సంజన తెలియజేశారు. ఇక తాను జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ఆ విషయాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయానని, తన ప్రెగ్నెన్సీ కారణంగా తాను మామూలు స్థితికి వచ్చాను అంటూ సంజన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సంజన 2020వ సంవత్సరంలో డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యి కొన్ని నెలలపాటు జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన ఈమెకు ఈ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇస్తూ 2024 లో కేసు కొట్టు వేసింది.

Also Read: అంధుడి పాత్రలో విజయ్ దేవరకొండ.. పోస్టర్ తో అంచనాలు పెంచిన శౌర్యవ్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×