E-Paper
Advertisement

Big tv kissik talks promo: బిగ్ బాస్ వల్ల లవ్ లో పడ్డాను.. డెమోన్ అని పిలిచిన పర్లేదు!

Big tv kissik talks promo: బిగ్ బాస్ వల్ల లవ్ లో పడ్డాను.. డెమోన్ అని పిలిచిన పర్లేదు!
Advertisement

Big tv kissik talks promo: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ రీతు చౌదరి పాల్గొని సందడి చేశారు. బుల్లితెర సీరియల్స్ , జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

నాగ్ సర్ కూడా ప్రేమలో పడ్డారు..

ఇలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న రీతు సుమారు 12 వారాల పాటు హౌస్ లో కొనసాగుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ అనంతరం ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా రీతు కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని బిగ్ బాస్ గురించి, తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని తాను బిగ్ బాస్ తో లవ్ లో పడ్డానని తెలిపారు. నేను మాత్రమే కాదు నాగ్ సర్ కూడా బిగ్ బాస్ ప్రేమలో పడ్డారు అంటూ రీతు తెలియజేశారు.

Advertisement

లవ్ ట్రాక్ నిజమేనా?

ఇక ఈ కార్యక్రమంలో తన ఫేవరెట్ కంటెస్టెంట్ డెమోన్ పవన్ అంటూ తెలియజేశారు . ఇప్పుడు నిన్ను రీతు అని పిలవాలా లేక డెమోన్ పిలవాలా అంటూ వర్షా ప్రశ్నించడంతో డెమోన్ అనిపించిన పర్లేదు కానీ దివ్య అని మాత్రం పిలవద్దు అంటూ ఈమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండటంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి మరి నిజంగానే వీరిద్దరి మధ్య లవ్ రిలేషన్ కొనసాగుతుందా లేదంటే కంటెంట్ కోసమే అలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇలా బిగ్ బాస్ ద్వారా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ జంట బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే క్లోజ్ గా మూవ్ అవుతున్న నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వీరిద్దరూ ప్రస్తుతం బీబీ జోడీ కార్యక్రమం కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంతో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక రీతు ఇంకా ఎలాంటి విషయాల గురించి ప్రస్తావించారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ పూర్తి ఎపిసోడ్ శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.

AlsoRead: Big tv kissik talks promo: నా ఉసురు తగలకుండా పోదు.. రీతూ శాపనార్థాలు ఆమెకేనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×