E-Paper
Advertisement

Talasani Srinivas Yadav: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి తలసానిపై కేసు నమోదు!

Talasani Srinivas Yadav: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి తలసానిపై కేసు నమోదు!
Advertisement

Talasani Srinivas Yadav: బీఆర్‌ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది.

కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ (SR Nagar) పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సికింద్రాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో తలసాని.. ముఖ్యమంత్రి పదవిని, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిపై ఇటువంటి పదజాలం వాడటం సమంజసం కాదని, దీనివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.

Advertisement

ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే నోటీసులు జారీ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Read Also: బీఆర్ఎస్ అవినీతికి ప్రతినెలా వడ్డీ కడుతున్నాం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×