E-Paper
Advertisement

Big tv kissik Talks Promo: అందుకే ఇంటర్వ్యూలకు రాను.. సీరియస్ అయిన ప్రియాంక సింగ్!

Big tv kissik Talks Promo: అందుకే ఇంటర్వ్యూలకు రాను.. సీరియస్ అయిన ప్రియాంక సింగ్!
Advertisement

Big tv kissik Talks Promo: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి వారం ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు సెలబ్రిటీలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ ప్రియాంక సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.  ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ప్రియాంక సింగ్ తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.

సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్..

ప్రియాంక సింగ్ లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈమె సాయి తేజగా జబర్దస్త్ షోలో సందడి చేశారు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సాయి తేజ సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిపోయారు. సర్జరీ తర్వాత ప్రియాంక సింగ్ గా అందరి ముందుకు వచ్చిన ఈమె అనంతరం బిగ్ బాస్ 5 రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వర్ష ఈ కార్యక్రమంలో ఈమెను ప్రశ్నిస్తూ ఇప్పుడు నిన్ను నేను సాయి అని పిలవాలా? లేక ప్రియాంక అని పిలవాలా ?అంటూ ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా ప్రియాంక అసహనం వ్యక్తం చేశారు.

బురదలో రాయి వేసినట్టే..

Advertisement

ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడగమన్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయనే తాను ఇంటర్వ్యూలకు వెళ్లను అంటూ ప్రియాంక తెలియచేశారు. ఇంటర్వ్యూలకు వెళ్లి ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోలేకపోతున్నానని.. ఇంటర్వ్యూలకు వెళ్లడం అంటే బురదలోకి రాయి వేసినట్టే అంటూ ఈ సందర్భంగా ప్రియాంక కాస్త అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఈమె సర్జరీ చేయించుకోవడం గురించి మాట్లాడుతూ.. తాను ప్రేమించిన అబ్బాయి కోసమే సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారానని అయితే సర్జరీ తర్వాత అబ్బాయి తనని మోసం చేసినట్లు పలు సందర్భాలలో ప్రియాంక తెలిపారు తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు.

Advertisement

తన ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈమె సర్జరీ చేయించుకొని చాలా నరకం అనుభవించానని, సర్జరీ కారణంగా అందరూ నన్ను చూసే ధోరణి కూడా మారిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఏదైనా ఒక షోలో పాల్గొన్నాను అంటే చాలామంది ఆ షోలో పార్టిసిపేట్ చేయకుండా వదిలి వెళ్లిపోయే వారని తెలిపారు. . ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రియాంక ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Big tv kissik Talks Promo: బిగ్ బాస్ తర్వాత కనిపించని ప్రియాంక సింగ్..అదే కారణం అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×