E-Paper
Advertisement

MSVPG: ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రోజే చిరంజీవి సినిమా ప్రెస్ మీట్, మేటర్ ఏంటంటే?

MSVPG: ఉస్తాద్ ఫస్ట్ సింగిల్ రోజే చిరంజీవి సినిమా ప్రెస్ మీట్, మేటర్ ఏంటంటే?
Advertisement

MSVPG: సంక్రాంతి సీజన్ లో రాబోతున్న సినిమాలలో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అనిల్ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గానే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద 100% సక్సెస్ ఉన్న ఈ తరం దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా అతనికి మాత్రమే తెలుసు అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది.

అలానే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది.

మన శంకర్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ 

Advertisement

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించిన ప్రశ్న డిసెంబర్ 13వ తారీఖున పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది ఇకపై నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాము అని అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే ఆ ప్రెస్ మీట్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక అనిల్ సినిమాని ఎంత ఎంటర్టైన్మెంట్ గా తీస్తాడు. ప్రమోషన్స్ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ గా ప్లాన్ చేస్తాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా సినిమా రీచ్ అయ్యే విధంగా అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాకి అదే స్థాయిలో చేస్తారు అని అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది. మెగాస్టార్ సినిమా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు.

అదే రోజున హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇదివరకే రిలీజ్ అయిన ప్రోమో ఫుల్ సాంగ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా మెగా అభిమానులకు ఆ రోజు డబుల్ ట్రీట్ అని అర్థమవుతుంది

అనిల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ 

Advertisement

అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా సంక్రాంతి సీజన్ కి తన సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. గతంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈసారి ఆ సినిమాను మించి కలెక్షన్లు రాబోతున్నాయి. ఈ విషయంపై అందరికీ ఒక అవగాహన ఉంది. ఎందుకంటే వెంకటేష్ కంటే చిరంజీవి స్టార్డం పెద్దది. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో సంక్రాంతికి తెలుస్తుంది.

Also Read: UBSFirstSingle : ఈ వీడియో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది, ఉస్తాద్ ఫస్ట్ సాంగ్ పై స్పెషల్ వీడియో

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×