E-Paper
Advertisement

Big tv kissik Talks Promo: బిగ్ బాస్ తర్వాత కనిపించని ప్రియాంక సింగ్..అదే కారణం అంటూ!

Big tv kissik Talks Promo: బిగ్ బాస్ తర్వాత కనిపించని ప్రియాంక సింగ్..అదే కారణం అంటూ!
Advertisement

Big tv kissik Talks Promo: జబర్దస్త్ సాయి తేజ అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టరు కానీ ప్రియాంక సింగ్ అంటే మాత్రం టక్కున అందరికీ ఈమె గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ప్రియాంక సింగ్ గా చలామణి అవుతున్న ఈమె సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. సాయి తేజగా అందరికీ సుపరిచితమైన ప్రియాంక అనంతరం అమ్మాయిగా మారి ప్రియాంక సింగ్ (Priyanka Singh)గా అందరి ముందుకు వచ్చింది. జబర్దస్త్ షో (Jabardasth show) లో  కమెడియన్ గా కొనసాగుతూ తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ప్రియాంక సింగ్ అనంతరం బిగ్ బాస్ సీజన్ 5  రియాలిటీ షో(Bigg Boss season 5) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా..

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ప్రియాంక మానస్ తో పులిహోర కలుపుతూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ తరువాత ప్రియాంక సింగ్ ఇటీవల ఎలాంటి కార్యక్రమాలలోనూ పాల్గొనలేదు. అయితే తాజాగా ఈమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ప్రియాంక తన కన్నీటి కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారు..

Advertisement

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష ప్రియాంకను ప్రశ్నిస్తూ అసలు బిగ్ బాస్ తర్వాత కనిపించడం మానేశావు ఏమయ్యావ్ ప్రియాంక అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బయటకు రాకపోవడానికి కారణం సోషల్ మీడియా అని తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తున్నారని పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఇక ఇంస్టాగ్రామ్ వచ్చిన తర్వాత చాలామంది దారుణంగా ఇతరుల గురించి కామెంట్లు చేస్తున్నారు అంటూ ఈమె మండిపడ్డారు. ఇక ప్రియాంక ఏ కార్యక్రమానికి వెళ్లిన ఆమె గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఈ తరుణంలోనే ఈ విధమైనటువంటి కామెంట్లను తాను భరించలేక అందరికీ దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, అలాగే తన ఫ్యామిలీ గురించి ప్రేమలో మోసపోవడం గురించి కూడా తెలియజేశారు. ఇక సర్జరీ సమయంలో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు నాగబాబుగారు చాలా సహాయం చేశారు అంటూ ఈ సందర్భంగా ప్రియాంక తెలియజేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇక పూర్తి ఎపిసోడ్లో భాగంగా ప్రియాంక ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారు ఏంటి అనేది తెలియనుంది. ఇక ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Samantha -Raj: పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ ఫోటో చూశారా.. క్యూట్ గా ఉన్న కొత్త జంట!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×