E-Paper
Advertisement

Allu Arjun : మౌగ్లి సెలబ్రిటీ షో కి హాజరైన బన్నీ, రోషన్ తో ఏమన్నాడంటే?

Allu Arjun : మౌగ్లి సెలబ్రిటీ షో కి హాజరైన బన్నీ, రోషన్ తో ఏమన్నాడంటే?
Advertisement

Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ హీరోలలో రోషన్ కనకల ఒకరు. తన మదర్ సుమా కనకాల గురించి, ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత పెద్ద భారీ ఈవెంట్ అయినా కూడా అలవోకగా మేనేజ్ చేస్తారు. ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగితే ఆ టైం కి ట్రైలర్ రాకపోయినా కూడా సుమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. చాలామంది పెద్దపెద్ద సెలబ్రిటీల ఈవెంట్స్ ను హోస్ట్ చేసిన అనుభవం ఆవిడకు ఉంది.

కేవలం ఈవెంట్స్ మాత్రమే కాకుండా తాను ప్రత్యేకించిగా చేసే రియాలిటీ షోలు కూడా చాలా ప్రత్యేకం. ఆవిడ చేసిన షోలో కనిపిస్తే సినిమాకు ఎక్స్ట్రా ప్రమోషన్ అవుతుంది అని చాలామందికి ఇండస్ట్రీలో ఒక నమ్మకం. దానినే కొంతమంది పాటిస్తూ ఉంటారు. అయితే సుమ కొడుకు రోషన్ కనకల ప్రస్తుతం సందీప్ రాజ్ దర్శకత్వంలో మౌగ్లీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలకు ప్రీమియర్ షోలు వేశారు.

హాజరైన బన్నీ 

Advertisement

అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బన్నీ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక ప్రోడక్ట్ కి చేశారు అంటే దాని సేల్స్ కూడా అమాంతం పెరుగుతాయి. ఇకపోతే మోగ్లీ సినిమా సెలబ్రిటీ షో కు హాజరయ్యారు బన్నీ.

సెలబ్రిటీ షోకు బ్లాక్ కలర్ వైట్ చెక్స్ షర్ట్ తో బన్నీ ఎంట్రీ ఇచ్చారు. తన హృదయపూర్వకమైన అభినందనలను సినిమా చూడడానికంటే ముందు రోషన్ కు తెలియజేశారు. ఏ ఎం బి లో ప్రస్తుతం సెలబ్రిటీ షో జరుగుతుంది. ఇక చూసిన తర్వాత సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి. అలానే వీడియో బైట్స్ కూడా బయటకు వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమ పరిచయాలే బలం 

Advertisement

చాలా పెద్ద సినిమాలకు తనదైన స్థాయిలో సుమ యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ ని హోల్డ్ చేశారు. అలానే సినిమా పైన అంచనాలు పెంచడానికి కూడా ఆవిడ యాంకరింగ్ ద్వారా ఇచ్చే ఎలివేషన్లు ఉపయోగపడుతుంటాయి. అయితే ఇప్పుడు తన కొడుకు సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎంత పెద్ద సెలబ్రిటీని సినిమా చూడమని రిక్వెస్ట్ చేసిన నో చెప్పే ఛాన్సెస్ లేవు. నిజంగా సినిమా బాగుంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ కానుంది.

Also Read: People Media Factory : సెన్సార్ బోర్డుకి క్షమాపణలు, ఆ నటుడి మాటలే కారణం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×