E-Paper
Advertisement

Big tv kissik Talks: జబర్దస్త్ నుంచి వెళ్ళలేదు.. వెళ్లగొట్టారు అసలు విషయం చెప్పిన ప్రియాంక!

Big tv kissik Talks: జబర్దస్త్ నుంచి వెళ్ళలేదు.. వెళ్లగొట్టారు అసలు విషయం చెప్పిన ప్రియాంక!
Advertisement

Big tv kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్(Jabardasth) కామెడీ షో ఒకటి. ఈ కార్యక్రమం ఎంతోమందికి మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ప్రేక్షకులకు పరిచయం అవ్వడమే కాకుండా ఈ షో ద్వారా ఎంతో మంది హీరోలుగా దర్శకులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక కొంతమంది కమెడియన్స్ ఈ షో ద్వారా మంచి సక్సెస్ అందుకొని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. ప్రియాంక జబర్దస్త్ షోలో సాయి తేజగా అందరికీ పరిచయమయ్యారు.

జబర్దస్త్ షో నుంచి తప్పించారు..

ఇక ఈ షోలో సాయి తేజ ఎక్కువగా లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. సాయి తేజ సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిన అనంతరం ప్రియాంక సింగ్ గా అందరికీ పరిచయమయ్యారు. ఇలా ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత జబర్దస్త్ షో కి కూడా దూరం అయ్యారు. అయితే తాజాగా కిస్సిక్ టాక్స్ షో భాగంగా జబర్దస్త్ షోకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ప్రియాంక సమాధానం చెబుతూ.. నేను జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోలేదని , వెళ్లగొట్టారు అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తాను సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పలేదు కానీ ఒక ఎపిసోడ్ కోసం షూటింగ్ కి వెళ్లాను మేకప్ కూడా అయ్యాను. ఆ క్షణమే జబర్దస్త్ టీం తన వద్దకు వచ్చి మీరు ఈ షోలో చేయటానికి వీలు లేదని చెప్పారు.

నా పక్కన నటించడానికి ఇష్టపడలేదు..

Advertisement

మీరు ఈ షోలో చేయటం వల్ల కొంతమంది ఆర్టిస్టులు తాము చేయమని చెబుతున్నారు అంటూ సమాధానం వచ్చింది. దీంతో నేను క్షణం కూడా ఆలోచించకుండా నా లగేజ్ తీసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయానని ప్రియాంక తెలియచేశారు. ఒక ట్రాన్స్ జెండర్ పక్కన మేము నటించలేము అంటూ చాలామంది చెప్పడంతోనే ఈ షో నుంచి తప్పించారని ప్రియాంక తెలిపారు. అయితే సర్జరీకి ముందు కూడా తాను లేడీ గెటప్ వేశాను, ఇప్పుడు ఒక లేడీగా నటిస్తాను అంటే ఇబ్బంది అన్నప్పుడు నేను అక్కడ ఉండాలనుకోలేదు అంటూ ప్రియాంక తెలిపారు.

Advertisement

ఒక జబర్దస్త్ షోలో మాత్రమే కాదు బయటకు ఎక్కడికి వెళ్లినా మాకు ఇలాంటి అవమానాలు జరుగుతాయని తెలిపారు. ట్రాన్స్ జెండర్ లతో మాట్లాడితే అదేదో ఒక తప్పుగా చూస్తారు. మేము నాలుగు గోడల మధ్యలోనే ప్రశాంతంగా బ్రతకగలమని బయటకు వెళ్తే కనీసం అవతల వైపు వారి వంక నేరుగా చూస్తూ మాట్లాడటానికి కూడా వీలు లేదు అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఏదిఏమైనా జబర్దస్త్ లాంటి ఒక మంచి షో తో మంచి సక్సెస్ అందుకున్న ఈమెను ఆ షో నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పించారనే విషయం తెలిసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తనను తప్పించడంతో నాకు ఏదో మంచి జరగబోతుంది అనుకున్నాను అలాగే ఒక వారం రోజులలోనే నాకు బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపారు.

Also Read: Big tv kissik Talks: నా జీవితంలో అదొక బ్లాక్ డే.. ఎమోషనల్ అయిన ప్రియాంక సింగ్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×