E-Paper
Advertisement

Road accident: ఓటు వేయడానికి గ్రామానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Road accident: ఓటు వేయడానికి గ్రామానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
Advertisement

ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉత్సాహంగా బయలుదేరిన ఆ ఇద్దరు యువకులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రెండో దశ పోలింగ్‌లో ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర నవీన్, బుర్ర కళ్యాణ్ బైకుపై బయలుదేరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వాహనం వీరి బైకును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటిగా ఉండటంతో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

విషాదంలో కుటుంబ సభ్యులు..

మృతులను నందనం గ్రామస్తులుగా గుర్తించిన పోలీసులు, సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఓటు వేయడానికి వస్తున్న కుమారులు విగతజీవులుగా మారారన్న వార్త వినగానే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

ALSO READ: CM Revanth vs Lionel Messi: రేవంత్‌, మెస్సీ ఫోటోల‌తో ఉప్పల్ లో లేజర్ షో..గూస్ బంప్స్ రావాల్సిందే

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×