E-Paper
Advertisement

Big tv Kissik Talks: అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు: ఇంద్రజ

Big tv Kissik Talks: అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు: ఇంద్రజ
Advertisement

Big tv kissik Talks: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా బ్రేకప్ చెప్పుకొని విడిపోతూ ఉంటారు. ఒకప్పుడు సెలబ్రిటీల విషయంలో మాత్రమే ఇలా లవ్ బ్రేకప్స్ ఉండేవి కానీ ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది బ్రేకప్ తర్వాత సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి . ఇలా తమ స్వార్థం కోసమే ఇతరులను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఇతర జీవితాలతో ఆడుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా లవ్ బ్రేకప్స్ గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు..

ప్రేమలో మోసపోవడం..

తాజాగా సీనియర్ నటి ఇంద్రజ(Indraja) బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా వర్ష ఇంద్రజను బ్రేకప్స్ గురించి కూడా ప్రశ్నించారు. బ్రేకప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురు కావడంతో ఇంద్రజ సమాధానం చెబుతూ.. ఒక మహిళ బేబీకి నాచురల్ బర్త్ ఇచ్చినప్పుడు ఎంతో పెయిన్ అనుభవిస్తుంది. ఆ సమయంలో వచ్చే నొప్పి బాధ మరి ఎప్పుడైనా వస్తుంది అంటే అది ప్రేమలో మోసపోయినప్పుడు మాత్రమేనని ఇంద్రజ తెలిపారు.

సూసైడ్ ఆలోచన తప్పు..

Advertisement

ప్రేమ పేరుతో అమ్మాయి కానీ అబ్బాయి కానీ మోసం చేశారు అంటే వాళ్లకు పుట్టగతులు ఉండవని, సర్వనాశనం అయిపోతారు. ఇలా బ్రేకప్ తర్వాత సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన తప్పని కూడా తెలిపారు. మీరు పుట్టింది ప్రేమ కోసం కాదు.. జీవితంలో ఏదైనా సాధించడం కోసం అంటూ ఈమె స్ఫూర్తి కలిగించే విషయాలు గురించి మాట్లాడారు. అలాగే ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీల వస్త్రధారణ గురించి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం గురించి కూడా ఈ సందర్భంగా ఇంద్రజ ఎన్నో విషయాలను ప్రస్తావించినట్టు ఈ ప్రోమోలో చూపించారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఇంద్రజ కెరియర్ విషయానికి వస్తే ఒకానొక సమయంలో వరుస సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Big tv kissi Talks: ఆ బంధం దేవుడు ఇచ్చినదే.. సుధీర్ విషయంలో ఇంద్రజ ఎమోషనల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×