E-Paper
Advertisement

Rohit Sharma: రిటైర్మెంట్ వెన‌క్కి.. టీ-20ల్లోకి వ‌చ్చేస్తున్న రోహిత్ శ‌ర్మ‌..?

Rohit Sharma: రిటైర్మెంట్ వెన‌క్కి.. టీ-20ల్లోకి వ‌చ్చేస్తున్న రోహిత్ శ‌ర్మ‌..?
Advertisement

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో 2024లో భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్ లో ఘనవిజయం సాధించింది. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టును 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు తొలి టీ-20 వరల్డ్ కప్ ని గెలుచుకుంది.

Also Read: Mitchell Starc: వ‌సీం అక్ర‌మ్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఏకంగా 415 వికెట్ల‌తో

Advertisement

ఆ జట్టులో రోహిత్ శర్మ కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు. తిరిగి 17 సంవత్సరాల తరువాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2024లో మళ్లీ టి-20 ప్రపంచ కప్ ని సొంతం చేసుకుంది. ఈ కప్ సాధించిన అనంతరం రోహిత్ శర్మ తన టి-20 అంతర్జాతీయ కెరీర్ కి వీడ్కోలు పలికాడు.

 

మళ్లీ టి20 క్రికెట్ లోకి రోహిత్ శర్మ:

Advertisement

టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మళ్ళీ టి-20 క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్ట్ లకు, టి-20 లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్, ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే టి-20 ల్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ శర్మ వెనక్కి తీసుకోనున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నెలలో జరిగే దేశీయ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ మళ్ళీ కనిపించనున్నాడని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. “రోహిత్ శర్మ 2025 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడేందుకు ఆసక్తి వ్యక్తం చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ {MCA} లో ఓ సీనియర్ అధికారి కూడా రోహిత్ శర్మ అందుబాటులోకి రాబోతున్నాడని ధ్రువీకరించారు”. అని పేర్కొంది. అయితే డిసెంబర్ 12 నుండి 18 వరకు జరిగే నాకౌట్ దశలో రోహిత్ శర్మ జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ చివరిసారిగా సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఆడింది 2007లో. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ దేశీయ టి-20 టోర్నీలో అడుగు పెట్టబోతున్నాడు.

 

రోహిత్ శర్మ టి20 కెరీర్ గణాంకాలు:

రోహిత్ శర్మ ఇప్పటివరకు తన టి-20 కెరీర్ లో 463 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 12,248 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 82 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అద్భుతంగా రానిస్తున్నాడు రోహిత్ శర్మ. మొదటి వన్డేని అద్భుతమైన హాఫ్ సెంచరీ తో ప్రారంభించాడు. ఈ వన్డే సిరీస్ కి ముందు జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి తన క్లాస్ ని మరోసారి చాటుకున్నాడు.

Also Read: Irfan Pathan: జ‌డేజా చేత‌కానీ త‌నం వ‌ల్లే టీమిండియా ఓట‌మి.. ఇక రిటైర్మెంట్ తీసుకో !

అయితే భారత జట్టుకు అందుబాటులో ఉండాలనుకున్న ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశీయ క్రికెట్ లో ఆడాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే.. 18 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మను సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో పాల్గొనేందుకు దారితీసిందని భావిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో రోహిత్ శర్మ కనబడడం ముంబై జట్టుకు భారీ బలాన్ని ఇస్తుందని చెప్పాలి. రోహిత్ శర్మ రాకతో టోర్నమెంట్ పై దృష్టి మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×