E-Paper
Advertisement

Big Tv Kissik Talks: సీరియల్ నటి హరిత అసలు పేరు ఏంటో తెలుసా…అందుకే మార్చారా?

Big Tv Kissik Talks: సీరియల్ నటి హరిత అసలు పేరు ఏంటో తెలుసా…అందుకే మార్చారా?
Advertisement

Big Tv Kissik Talks: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేదా బయట ఎవరికైనా ఒక పేరు మీద సరిగ్గా కలిసి రావడం లేదు అంటే పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం సర్వసాధారణం. ఇలా ప్రతి ఒక్కరు వారి పేర్లలో ఆస్ట్రాలజీ ప్రకారం పదాలు మార్చు కోవటం, లేదంటే వేరే మార్చుకోవడం జరుగుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీలు సక్సెస్ అందుకోవడం కోసం పేర్లను మార్చుకున్న విషయం మనకు తెలిసిందే. వారి అసలు పేరు ఒకటైతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మరొక పేరును పెట్టుకొని అదే పేరుతో చలామణి అవుతున్నారు. ఈకోవకు చెందినవారే బుల్లితెర నటి హరిత(Haritha).

హరిత అసలు పేరు శాంతి..

బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న హరిత తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన అసలు పేరు గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు తన అసలు పేరు హరిత కాదని శాంతి(Shanthi) అనే విషయాన్ని తెలియజేశారు. తన ఇంట్లో తనకు మాత్రమే కాదు తన అన్నయ్య చెల్లికి కూడా S అనే అక్షరంతోనే పేరు పెట్టాలని అన్నయ్యకు శేషు, నాకు శాంతి, రవళికి శైలజ అని పేరు పెట్టారని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నా పేరు హరితగా మారిపోయిందని ఈమె తెలియజేశారు.

సీరియల్స్ కోసమే పేరు మార్పు..

Advertisement

ఇలా పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని కూడా హరిత తెలియజేశారు. తాను చిన్నప్పటి నుంచి కూడా చాలా సైలెంట్ గా ఉండేదాన్ని. ఎవరితో పెద్దగా మాట్లాడకపోయే దాన్ని అందుకే తనకు పేరు మారిస్తే నైనా అందరితో కలుస్తానని అనుకున్నారు అదే సమయంలో సీరియల్స్ లో చేసే అవకాశం వచ్చింది. సీరియల్స్ లో తనది ప్రధాన పాత్ర కావడంతో శాంతి అనే పేరు వర్క్ అవుట్ అవ్వదని ఆ పేరు శాంతంగానే ఉంటుంది అందుకే హెచ్ అనే పదంతో పేరు పెడదామని నిర్ణయించుకున్నారు ఆ సమయంలోనే హరిత అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు.

Advertisement

హరిత అంటే పచ్చదనం. ఈ పేరు పెట్టుకున్న తర్వాత తను కూడా ఒక అడుగు జీవితంలో ముందుకు వేసి పెద్ద ఎత్తున సినిమాలు సీరియల్స్ లో నటించానని హరిత తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా శాంతి నుంచి హరితగా ఈమె పేరు మార్చుకున్నప్పటికీ పలు సీరియల్స్ లో నటించిన పాత్రల పేర్లతో ఈమె అభిమానులకు బాగా గుర్తుండిపోయారు. ముఖ్యంగా ముద్దమందారం సీరియల్ లో అఖిలాండేశ్వరిగా హరిత మంచి ఆదరణను సొంతం చేసుకున్నారనే చెప్పాలి. ఇక హరిత ప్రస్తుతం పలు బుల్లితెర, సీరియల్స్, కార్యక్రమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Big Tv Kissik Talks: సినిమా అవకాశాలు రాకుంటేనే సీరియల్స్ చేస్తారా? హరిత కామెంట్స్ వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×