E-Paper
Advertisement

Xiaomi X Pro QLED 75: ఇక థియేటర్‌కు వెళ్లనక్కర్లేదు.. తక్కువ ధరలో షియోమీ 75 ఇంచుల క్యూలెడ్ టీవీ!

Xiaomi X Pro QLED 75: ఇక థియేటర్‌కు వెళ్లనక్కర్లేదు.. తక్కువ ధరలో షియోమీ 75 ఇంచుల క్యూలెడ్ టీవీ!
Advertisement

Xiaomi X Pro QLED 75: సాధారణంగా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్న స్మార్ట్ టీవీని ఎంచుకోవడం ఒకప్పుడు పెద్ద సవాలుగా ఉండేది. మార్కెట్‌లో వందల ఆప్షన్లు ఉన్నా.. మనం పెట్టే ప్రతి రూపాయికి తగ్గ క్వాలిటీ ఇచ్చే బ్రాండ్లు చాలా తక్కువ. ఈ విషయంలో షియోమీ తన X Pro QLED సిరీస్‌తో అన్ని బ్రాండ్ల కంటే ముందు వరుసలో ఉంది. తాజాగా ఈ కంపెనీ 75 ఇంచుల భారీ స్క్రీన్‌తో కొత్త ఫ్లాగ్‌షిప్ టీవీని లాంచ్ చేసింది. కేవలం రూ.69,999కే ఇంత పెద్ద స్క్రీన్ అంటే.. అస్సలు నమ్మలేకపోతున్నాం కదూ. ఇంతకీ ఈ టీవీలో అంత స్పెషల్ ఏముందో చూసేద్దామా..

నేచురల్ కలర్స్:

ఈ టీవీకి ప్రధాన ఆకర్షణ దీని 75 ఇంచుల క్యూలెడ్ ప్యానల్. దీనిపై ఉండే మ్యాట్ ఫినిషింగ్ వల్ల గదిలో లైట్లు ఉన్నా స్క్రీన్‌పై రిఫ్లెక్షన్స్ పడవు. కలర్స్ కూడా చాలా నేచురల్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా Filmmaker mode ఈ టీవీలో హైలైట్ అనే చెప్పాలి. సాధారణంగా సోనీ వంటి ఖరీదైన టీవీల్లో మాత్రమే కనిపించే ఈ ఫీచర్.. మూవీ డైరెక్టర్ ఏ రంగులనైతే సినిమాలో చూపించాలనుకుంటాడో.. అవే రంగులను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఈ టీవీ ద్వారా 4K సినిమాలు, లైవ్ క్రికెట్ చూసినా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.

Advertisement

Also Read: కొత్త ఏసీ కొనే ప్లాన్ ఉందా? జనం ఎగబడి కొంటున్న ఈ బెస్ట్ సెల్లింగ్ ఏసీలపై ఓ లుక్కేయండి!

యాప్స్ వాడకం సులభం:

గతంలో షియోమీ టీవీల్లో యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంత జాప్యం ఉండేది. కానీ ఈ కొత్త 75 ఇంచుల మోడల్‌లో ఆ సమస్యకు చెక్ పెట్టారు. ఈ టీవీలో ఉన్న క్వాడ్ కోర్ చిప్, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల సెటప్ చేయడం నుంచి యాప్స్ వాడకం వరకు అంతా చాలా సులభంగా ఉంటుంది. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ యూజర్లకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.

సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే?

Advertisement

డిజైన్ పరంగా ఈ టీవీ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. అయితే, టేబుల్ టాప్ స్టాండ్స్ మాత్రం టీవీ రేంజ్‌కు తగ్గట్టుగా లేవనిపిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. దీనిలో 34 వాట్ల స్పీకర్లు ఉన్నాయి. ఇవి క్రికెట్ మ్యాచ్‌లు, వార్తలు చూడటానికి బాగుంటాయి కానీ, సినిమా థియేటర్ వంటి అనుభవం కావాలంటే మాత్రం మంచి సౌండ్ బార్‌ను జత చేసుకోవాలి.

ఇంట్లోనే థియేటర్:

భారీ స్క్రీన్, అద్భుతమైన కలర్స్, నమ్మకమైన బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి షియోమీ X Pro QLED 75 బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో మీ ఇంట్లోనే సినిమా థియేటర్ సెటప్ చేసుకోవాలనుకుంటే దీనికి మించిన ఛాయిస్ ప్రస్తుతం మార్కెట్‌లో లేదనే చెప్పాలి.

Also Read: భూకంపాన్ని ముందే చెప్పేసే స్మార్ట్ వాచ్.. ఇక ఫోన్‌తో పని లేదు, ఇది ఎలా పనిచేస్తుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×