E-Paper
Advertisement

జైలు జీవితం పై సంజనా ఎమోషనల్… బలి పశువును చేశారంటూ?

జైలు జీవితం పై సంజనా ఎమోషనల్… బలి పశువును చేశారంటూ?
Advertisement

Big Tv Kissik Talks: సంజన గల్రానీ పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజనా తిరిగి కెరియర్ పరంగా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీ అవుతున్నారు. తాజాగా సంజన కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె అరెస్ట్ కావడం గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన తప్పు లేకుండానే తనని అరెస్టు చేసి బలి పశువును చేశారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

చావు అంచు వరకు వెళ్లాను..

సంజన గతంలో డ్రగ్స్ ఆరోపణలలో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. జైలుకు వెళ్లడం అనేది చాలా నరకమని తాను చావు అంచుల వరకు వెళ్లి వచ్చాననీ తెలిపారు. శత్రువులకు కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదని ఈమె తెలిపారు. అసలు నేనేమి తప్పు చేయకుండానే నాపై తప్పుడు ఆరోపణలు చేసి నన్ను బలి పశువుని చేశారని ఈమె తెలిపారు. నేను బిగ్ బాస్ కార్యక్రమానికి రావడానికి కారణం కూడా ఇదేనని సంజన క్లారిటీ ఇచ్చారు. తాను బిగ్ బాస్ లోకి వెళ్తానని చెప్పినప్పుడు తన బంధువులందరూ తిట్టారు తన భర్త కూడా 5 నెలల పాపను వదిలి ఎలా వెళ్తావు అంటూ తిట్టారని సంజన తెలిపారు.

నింద చెరిపేయడం కోసమే బిగ్ బాస్..

Advertisement

ఇలా అందరూ తనని తిడుతున్నప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను నాపై నింద పడింది అందుకే వెళ్తున్నానని చెప్పాను. తాను బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 3 నెలల పాటు ఉన్నాను ఏ ఒక్క చెడ్డ అలవాటు నాలో చూశారా అంటూ ఈ సందర్భంగా ఈమె కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. జైలు జీవితం గురించి సంజన మాట్లాడుతూ అలాంటి కష్టం పగవారికి కూడా రావద్దు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో సంజన ఎలాంటి విషయాలను మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్..

Advertisement

ఇక సంజన గతంలో డ్రగ్స్ ఆరోపణలను ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. ఈమె అరెస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది. 2020 సెప్టెంబర్ 8న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా ఈమెకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కొన్ని నెలల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఈమె బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా బెయిల్ మీద బయటకు వచ్చిన సంజన తప్పు లేదంటూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వటం గమనార్హం. ఇలా అరెస్టు చేసి తనని జైలులో పెట్టి అనంతరం తన తప్పులేదు అంటూ కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈమె ఎంతో అవమానాన్ని భరించింది అయితే తన తప్పు లేదని నిరూపించుకోవడం కోసమే బిగ్ బాస్ లోకి వెళ్ళాను అంటూ ఈ సందర్భంగా సంజన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ఇమ్మాన్యుయేల్ మరో బ్రహ్మానందం అవుతారు… సంజనా కామెంట్స్ విన్నారా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×