E-Paper
Advertisement

Shahid Afridi: బాబ‌ర్ ఆజం స్థాయికి ఎదగాలంటే అభిషేక్ శ‌ర్మ మ‌రో జ‌న్మ ఎత్తాల్సిందే

Shahid Afridi: బాబ‌ర్ ఆజం స్థాయికి ఎదగాలంటే అభిషేక్ శ‌ర్మ మ‌రో జ‌న్మ ఎత్తాల్సిందే
Advertisement

Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతూనే ఉన్నారు. ఐపీఎల్ టోర్నమెంటులో ఆడే ఇండియన్స్ ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా అభిషేక్ శర్మను ( Abhishek Sharma) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షాహిద్ అఫ్రిది ( Shahid Afridi). బాబర్ ఆజం ( Babar Azam ) స్థాయికి చేరాలంటే అభిషేక్ శర్మ మరో జన్మ ఎత్తాల్సిందే అంటూ బాంబు పేల్చారు షాహిద్ అఫ్రిది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు తప్ప… టీమిండియా తరఫున అభిషేక్ శర్మ ఆడిన దాఖలాలు పెద్దగా లేవని పరువు తీశారు. కీలకమైన టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సమయంలో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడని ఫైర్ అయ్యారు.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

బాబ‌ర్ ఆజం స్థాయికి ఎదగాలంటే అభిషేక్ శ‌ర్మ మ‌రో జ‌న్మ ఎత్తాల్సిందే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు బాబర్ ఆజం. ఈ క్రమంలోనే అతన్ని మెచ్చుకుంటూ అభిషేక్ శర్మను కించపరిచే ప్రయత్నం చేశాడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడని అభిషేక్ శర్మ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. టీమిండియా కోసం ఆడని అభిషేక్ శర్మ… డబ్బుల కోసం మాత్రం ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. అభిషేక్ శర్మ బ్యాట్లను కూడా ఐపీఎల్ లో ఎవరు చెక్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. అతని బ్యాట్ లో చిప్ లు కూడా ఉన్నాయని వెల్లడించారు.

ఐపీఎల్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నాశనం అవుతోంది

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈనెల చివరలో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 30వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇందులో భాగంగానే 25వ తేదీన ఇస్లామాబాద్ చేరుకోనుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. హడావిడిగా ఐపీఎల్ టోర్నమెంటును వదిలేసి పాకిస్తాన్ వెళ్ళకూడదని ఆస్ట్రేలియా ప్లేయర్లకు దిశా నిర్దేశం చేసింది. ఆస్ట్రేలియా B జట్టును పాకిస్తాన్ పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షాహిద్ అఫ్రిది సీరియస్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament)  కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నాశనం అవుతుందని ఫైర్ అయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలికి తలవంచి క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరిస్తోందని సీరియస్ అయ్యారు. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐసీసీకి (ICC)  కూడా లేఖ రాస్తాన‌ని హెచ్చ‌రించారు షాహిద్ అఫ్రిది.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×