E-Paper
Advertisement

Big tv Kissik Talks: మనిషిలో అది లేకపోతే ప్రతి ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు!

Big tv Kissik Talks: మనిషిలో అది లేకపోతే ప్రతి ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు!
Advertisement

Big tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్ష యాంకర్ గా బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటి జ్యోతి(Jyothi) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జ్యోతి రాజకీయాల గురించి సినిమాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

పొగరు ఉండాల్సిందే..

నటి జ్యోతి చూడగానే తన ఫేసులో పొగరు కనిపిస్తుంది. ఆ పొగరే తనుకు అందం అని ఎన్నో సందర్భాలలో తెలిపారు. అయితే తాజాగా వర్ష ఇదే విషయం గురించి అడగడంతో జ్యోతి సంచలన విషయాలను వెల్లడించారు. మీ పొగరే మీకు అందమా అంటూ యాంకర్ వర్ష ప్రశ్నించారు. పొగరు అనేది ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాల్సిందే. ఆ పొగరు లేకపోతే ప్రతి అడ్డమైనోడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటూ ఈ సందర్భంగా జ్యోతి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే ఈమె ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది తెలియాలి అంటే మనం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతుంది.

క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు..

Advertisement

ఇకపోతే ఈమె ప్రతి ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటూ చేసిన కామెంట్లు వెనుక ఎంతో బాధ ఉందని స్పష్టం అవుతుంది. ఇండస్ట్రీ అన్న తర్వాత సెలబ్రిటీలు ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఎంతోమంది దర్శక నిర్మాతలు క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch)పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. బహుశా ఇలాంటి ఇబ్బందులను నటి జ్యోతి కూడా ఎదుర్కొన్నారా? అందుకే ఈమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక ఈమె ఈ కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీలోకి రావడం గురించి కూడా మాట్లాడారు తాను హీరోయిన్ అవుదామనే హైదరాబాదులోకి అడుగు పెట్టాను. ఇక తనకు హీరోయిన్ గా అవకాశాల కంటే కూడా ఎక్కువగా గ్లామర్ పాత్రలు, అలాగే ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతి ఇటీవల తిరిగి కెరియర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి కూడా ఈమె ఈ కార్యక్రమంలో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Spirit Movie: స్పిరిట్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి.. ఈసారి మాట తప్పరు కదా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×