E-Paper
Advertisement

Manas Nagulapalli : హే.. మానస్ నువ్వేనా.. ఇలా అయిపోయావేంటి..?

Manas Nagulapalli : హే.. మానస్ నువ్వేనా.. ఇలా అయిపోయావేంటి..?
Advertisement

Manas Nagulapalli : బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ హీరో, హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. సినిమా హీరో, హీరోయిన్ల కన్నా బుల్లితెర యాక్టర్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. డైలీ సీరియల్స్ లలో కనిపిస్తూ ప్రేక్షకుల ఆధరణను పొందిన వారిలో బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగులపల్లి ఒకరు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత బుల్లితెరపై హీరోగా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆయన తన కొడుకుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ హీరో లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏకంగా చర్చలు జరుగుతున్నాయి. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

గుర్తు పట్టలేనంతగా మారిన మానస్.. 

బుల్లితెర హీరో మానస్నాగులపల్లి పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరో ఈమధ్య డాన్స్ షోలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ యాజమాన్యం నిర్వహిస్తున్న బీబీ జోడిలో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నాడు. ఆ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మానస్ ను చూసి అందరు అవాక్కవుతున్నారు. అందులో బక్కగా గడ్డం లేకుండా కనిపిస్తున్నాడు. ఆ ప్రోమో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన నెటిజెన్లు మానస్ కి ఏమైంది అలా మారిపోయాడు ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :కుర్ర హీరోయిన్ టాలెంట్ కు ఫ్యాన్స్ ఫిదా.. అమ్మ దొంగ దొరికేసిందిగా..

శ్రేష్ఠతో మానస్ తో సూపర్ డ్యాన్స్.. 

బిగ్ బాస్ యాజమాన్యం నిర్వహిస్తున్న లేటెస్ట్ షో బేబీ జోడి సీజన్ 2.. ఈ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ షో గురించి ఇప్పటికే పలు రకాల విమర్శలు ఎదురవుతున్నాయి.. కొన్ని జంటలు తమంతట తామే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం పై నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం హైలెట్ గా నిలిచింది. అందులో ఎవరికి వారే అన్నట్టుగా డాన్సర్లు అందరూ కూడా ఎవరికి వారే అన్నట్లుగా గట్టి పోటీనిస్తూ దుమ్ము దులిపేశారు. అయితే మానస న్యూ లుక్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఎప్పుడూ గుబురు గడ్డంతో కనిపించే మానస్ ఇప్పుడు కాస్త సన్నబడి గుర్తుపట్టని విధంగా కనిపిస్తున్నాడు.. అయితే కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మతో కలిసి అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నటరాజ స్వామి ఆకారంలో మానస్ చేసిన డ్యాన్స్ కి జడ్జిలు ఫిదా అయ్యారు. మొత్తానికి ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మానస్ నిజంగానే కావాలని బరువు తగ్గాడా? లేకపోతే ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీనిపై అతను ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×