E-Paper
Advertisement

Sangeeth Sobhan: జాక్పాట్ కొట్టిన సంగీత్.. ఏకంగా ఆ దర్శకుడితో ఛాన్స్!

Sangeeth Sobhan: జాక్పాట్ కొట్టిన సంగీత్.. ఏకంగా ఆ దర్శకుడితో ఛాన్స్!
Advertisement

Sangeeth Sobhan: యువ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ హీరో గురించే చర్చ.. సింపుల్ స్మైల్ తో అద్భుతమైన నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఇక అందులో భాగంగానే అటు సంగీత్ శోభన్ కి వరుస అవకాశాలు కూడా తలుపుతడుతున్నాయి. ఇదివరకే మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, గ్యాంబ్లర్స్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం ‘రాకాసా’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తెలుగు ఫాంటసీ- కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

జాక్ పాట్ కొట్టిన సంగీత్..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల (Niharika Konidela), ఉమేష్ కుమార్ బన్సాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా విజయం తర్వాత నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అటు సంగీత్ శోభన్ కూడా ఈ మధ్య తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది అలాంటి ఈయన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు అప్పుడే మరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు సమాచారం.

సూర్య ప్రతాప్ డైరెక్షన్లో సంగీత్..

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సూర్య ప్రతాప్ (Surya Pratap) డైరెక్షన్లో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. హీరోయిన్గా అనస్వర రాజన్ (Anaswara rajan) ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా మారిపోతూ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు సంగీత శోభన్.

సంగీత్ బ్యాక్ గ్రౌండ్..

ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే.. ఈయన ఎవరో కాదు ప్రముఖ సినీ దర్శకుడు శోభన్ (Shobhan) కుమారుడు. ప్రముఖ సినీ దర్శకుడు శోభన్.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా , త్రిష (Trisha) హీరోయిన్గా వచ్చిన వర్షం సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘బాబీ’ సినిమాకి కూడా ఈయనే దర్శకత్వం వహించడం గమనార్హం. ఈయన సోదరుడు లక్ష్మీపతి సినీ నటుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా కేవలం వారం తేడాతో స్వర్గస్తులవడం అందరిని అప్పట్లో కలిచివేసింది.

Advertisement

also read:Santosh Sobhan: హీరో సంతోష్ శోభన్ చివరిగా ఏడ్చింది అప్పుడే.. అసలు ఏం జరిగిందంటే?

చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలు..

ఇకపోతే సంగీత్ 2011లో తొలిసారి ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం ద్వారా బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటించారు. ఇక తర్వాత త్రీ రోజెస్ , పిట్టకథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్లో నటించిన ఈయన.. మ్యాడ్ సినిమాలో డిడి పాత్రతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ప్రేమ విమానం, మ్యాడ్ స్క్వేర్ అంటూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×