E-Paper
Advertisement

Ashu Reddy: పెళ్లి పేరుతో రూ.9కోట్లు మోసం.. కేసు ఫైల్..స్పందించిన అషు రెడ్డి!

Ashu Reddy: పెళ్లి పేరుతో రూ.9కోట్లు మోసం.. కేసు ఫైల్..స్పందించిన అషు రెడ్డి!
Advertisement

Ashu Reddy:బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.9.35 కోట్లు కాజేసిందనే ఆరోపణలతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కూడా హైదరాబాదులో సిటీ సెంటర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో నమ్మించి , మోసం చేసి రూ.9.35 కోట్ల మేరా ఆస్తులు, కారు, బంగ్లాలు కొనుగోలు చేసి.. తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందని బాధితుడు తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా.. ఈ వార్త కాస్త దావాణంలా పాకిపోయింది. ఇక దీనిపై అషు రెడ్డి తాజాగా స్పందించింది.

ప్రేమ పేరుతో రూ.9.5 కోట్లు భారీ మోసం.. స్పందించిన అషు రెడ్డి..

గత కొన్ని గంటలుగా అషు రెడ్డి ప్రేమ పేరుతో మోసం చేసిందని, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అషు రెడ్డి తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఒక పోస్ట్ పంచుకుంది. “నా అనుమతి లేకుండా నా గురించి ఏ వార్త లేదా ఏ తప్పుడు సమాచారం ప్రచారమైనా సరే దానిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి” అంటూ అషు రెడ్డి తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

Advertisement

సీసీఎస్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాదులోని షేక్ పేట్ లో నివాసం ఉంటున్న యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి కుమారుడు వైవీ ధర్మేంద్ర ప్రస్తుతం లండన్ లో ఐటీ జాబ్ చేస్తున్నాడు. హాలిడేస్ కోసం 2018లో ఇండియాలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు ధర్మేంద్ర. అదే సమయంలో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఆమె అమెరికాలో చదువు పూర్తిచేసి కొంతకాలం అక్కడ ఉద్యోగం చేశానని, సినిమా అవకాశాల కోసమే హైదరాబాద్ వచ్చినట్లు ధర్మేంద్ర తో చెప్పిందట. ఇక ఆ పరిచయం కాస్త కొన్ని రోజుల తర్వాత అషు రెడ్డి స్వయంగా ధర్మేంద్రకి ప్రపోజ్ చేసిందట. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటూ ధర్మేంద్రను నమ్మబలికిందని.. ఇక ఆ ప్రేమ చాటున ఆర్థిక అవసరాల కోసం డబ్బులు బాగా దండుకోవడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా కారు, ఇల్లు, ఐదు కిలోల బంగారంతో పాటు ఇతర ఆస్తులు పోగుచేసి వాటన్నింటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట. ఇక మొత్తం విలువ 9.35 కోట్లు అని సమాచారం. అటు అషు రెడ్డి పేరెంట్స్ పెళ్ళికి ముహూర్తం అంటూ పంతుల్ని కూడా తీసుకొచ్చి హడావిడి చేశారట. కొన్ని రోజుల్లోనే పెళ్లికి సిద్ధమవుతుండగా ముఖం చాటేసినట్లు తెలుసుకొని మోసపోయినట్లు ధర్మేంద్ర గ్రహించాడు ..ఇక 2025 నాటికి 9.35 కోట్లు ధర్మేంద్ర నుంచి ఈమె వసూలు చేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఆరోపిస్తున్నారు. ఈమె సోదరి కూడా 50 లక్షలు తీసుకున్నట్లు ధర్మేంద్ర తండ్రి తన ఫిర్యాదులో తెలుపగా ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ALSO READ:పెళ్లి పేరుతో భారీ మోసం.. రూ.9.35 కోట్లు స్వాహా.. అషురెడ్డిపై కేస్ ఫైల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×