E-Paper
Advertisement

టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?

టీడీపీ పేరును ఎన్టీఆర్ కూడా మార్చాల‌నుకున్నారా? టీఆరెస్ పేరును కేసీఆర్ మార్చి త‌ప్పు చేశారా?
Advertisement

ఇప్పుడు పార్టీ పేర్లు మీద డిస్క‌ష‌న్ న‌డుస్తున్న‌ది. కేసీఆర్ త‌న పార్టీ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి త‌ప్పు చేశార‌నే ఫీలింగు అంద‌రికీ ఉంది. దీన్ని ఇప్పుడు క‌విత అందిపుచ్చుకున్నారు. కేసీఆర్ చేసిన త‌ప్పిదాలు, ఆ పాల‌న లోపాలే ఆమె త‌న పార్టీకి పాఠాలుగా తీసుకున్నారు. ఏకంగా పార్టీ పేరునే ఆమె తీసేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన‌..గా టీఆరెస్ పేరును ఆమె ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. కేవ‌లం ఆ పార్టీ పేరుకున్న క్రెడిబిలిటీని రాజ‌కీయంగా వాడుకుందామ‌ని కాదు… ఆ పార్టీ పాత పేరు ద్వారా మ‌ళ్లీ జ‌నం న‌మ్మ‌కాన్ని.. వాళ్లు పెట్టుకున్న ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారామె. ఒక ర‌కంగా చెప్పాలంటే.. కేసీఆర్ చేయ‌న‌వి.. చేయ‌డం. న‌మ్ముకుని భంగ‌ప‌డ్డ బాధితుల‌కు భ‌రోసాగా ఉండి.. నేనున్నాననే ధైర్యాన్నివ్వ‌డం. వారిలో ఆశ‌లు చిగురింప‌జేయ‌డం ఆమె ఉద్దేశ్యంగా క‌నిపిస్తున్న‌ది.

క‌చ్చితంగా అంద‌రు చెప్పేది.. ఒప్పుకునేదొక్క‌టే. టీఆరెస్‌ను.. బీఆరెస్‌గా మార్చ‌డం త‌ప్పు అని. అయితే ఎన్టీఆర్ త‌న టీడీపీ పేరును కూడా మార్చాలకున్నార‌నే విష‌యం ఎంత‌మందికి తెలుసు. కేసీఆర్ ఎట్లైతే.. త‌ను జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్నారో.. ఎన్టీఆర్‌కూ ఓ ద‌శ‌లో ఆ ప‌రిస్థితి వ‌చ్చింది. జాతీయ రాజ‌కీయాల‌పై మ‌క్కువ పెరిగింది. కానీ ఎన్టీఆర్ నాటి ప‌రిస్థితుల‌కు, కేసీఆర్ పార్టీ మార్చే ప‌రిస్థితుల‌కు చాలా తేడా ఉంది. కేసీఆర్‌కు.. త‌న కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాల‌నుకున్నారు. అందుకే తెలంగాణ నుంచి వైదొలిగి.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నుకున్నారు. కానీ తెలంగాణ‌లోనే ఆయ‌న‌కు స‌రైన స్థానాలు లేవు.. ఇంకా బ‌లం కూడా పెద్ద‌గా పుంజుకోలేదు. కానీ ఆనాడు ఎన్టీఆర్‌కు దేశంలోనే చెప్పుకోద‌గ్గ స్థానాలు వ‌చ్చాయి.

Advertisement

33 సీట్ల‌తో కేంద్రంలో కీల‌కంగా ఉన్నారాయ‌న‌. నాదెండ్ల భాస్క‌ర్ ఉదంతం త‌రువాత ఎన్టీఆర్ మ‌ళ్లీ పోటీ చేయ‌డం గెల‌వ‌డం జ‌రిగిపోయారు. ఆ త‌రువాత వ‌చ్చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ ఓడిపోయారు. కానీ 33 లోక్‌స‌భ సీట్లు సాధించారు. దీంతో ఆయ‌న తెలుగు దేశం పార్టీ పేరును భార‌త దేశం పార్టీ పేరుగా మార్చాల‌నుకున్నారు. అంటే టీడీపీకి బ‌దులు.. బీడీపీ అని మార్చాల‌నుకున్నారు. కానీ ఆయ‌న త‌రువాత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.అప్పుడాయ‌న నేష‌న‌ల్ ఫ్రంట్‌లో కీల‌కంగా ఉన్నా.. పార్టీ పేరును మార్చే ఆలోచ‌న వ‌చ్చినా.. వెన‌క‌డుగు వేశారు.

కానీ ఇక్క‌డ కేసీఆర్ మాత్రం త‌గినంత బ‌లం ఎక్క‌డా లేకున్నా.. అతి విశ్వాసంతోనే పార్టీ పేరును మార్చార‌నే చెప్పాలి. అందుకే ఈ త‌ప్పుకు ఆయ‌న ఫ‌లితం అనుభ‌వించారు. ఆ త‌రువాతైనా తేరుకున్నారా అంటే.. అహం ఆయ‌న్ను మార‌నివ్వ‌లేదు. అందుకే పార్టీ పేరు మార‌లేదు. ఇప్పుడు క‌విత ఆ పేరును తీసుకున్న త‌రువాత గ‌గ్గోలు పెడుతున్నారు. మాది పేటెంటు.. మేమే ఒరిజిన‌ల్ అని.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×