E-Paper
Advertisement

Anasuya: బాంబు పేల్చిన అనసూయ.. ఇండస్ట్రీ గుట్టు రట్టు చేస్తుందా?

Anasuya: బాంబు పేల్చిన అనసూయ.. ఇండస్ట్రీ గుట్టు రట్టు చేస్తుందా?
Advertisement

Anasuya: న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టి.. జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగుపెట్టిన యాంకర్ అనసూయ (Anasuya ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకొని షో టీఆర్పి రేటింగ్ పెంచడంలో మొదటి పాత్ర వహించారు. గ్లామర్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే.. మరొకవైపు పలు సినిమాలలో అవకాశాలు అందుకొని అందరి చేత ఔరా అనిపించుకున్నారు. ముఖ్యంగా పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయడంలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో నిరూపించారు. సుకుమార్ – రామ్ రణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఎంతగా ఒదిగిపోయారంటే.. ఈ పాత్రకు అనసూయ తప్ప మరొకరు న్యాయం చేయలేరేమో అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి.

అభిప్రాయాలను వివాదాలుగా మారుస్తున్నారు – అనసూయ

ఆ తర్వాత పుష్ప సినిమాలో దాక్షాయినిగా, రజాకార్ సినిమాలో అంతకుమించిన నటనను కనపరిచి అందరినీ ఆశ్చర్యపరిచింది అనసూయ.. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తోందనే చెప్పాలి.. ముఖ్యంగా ఈమె క్రేజ్ ను చూసి సినిమాలలో హీరోయిన్గా నటించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్ లలో కూడా అలరించిన విషయం తెలిసిందే. అలాంటి అనసూయ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ పలు విషయాలలో తన అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ అభిప్రాయాలను కొంతమంది వివాదాలుగా మార్చేస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కొత్త బ్లాగ్ కోసం సలహా కోరిన అనసూయ..

Advertisement

ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా.. తాను కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టబోతున్నాను. ఏ ఫ్లాట్ ఫామ్ లో బ్లాగింగ్ చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి అంటూ ఫాలోవర్స్ ని కోరింది అనసూయ. ఈమె సలహా కోరడంతో అటు ఫాలోవర్స్ కూడా బ్లాగింగ్ మొదలు పెట్టడానికి అవసరమైన టూల్స్ తో పాటు బెస్ట్ ప్లాట్ఫార్మ్స్ ని కూడా సజెస్ట్ చేశారు. అందులో కొంతమంది WordPress.org, Wix, Squarespace వంటి ఫ్లాట్ ఫార్మ్స్ పేర్లను ఆమెకు సజెస్ట్ చేశారు. ఇంకొంతమంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో బ్లాగింగ్ చేయమని కోరారు. ఇంకొంతమంది వాళ్లని వీళ్ళని అడగడం కాదు చాట్ జిపిటిని అడగండి అంటూ చెప్పడంతో అనసూయ అందుకు కౌంటర్ ఇచ్చింది.” నేను చాట్ జిపిటిని ఉపయోగించను.. కేవలం మనుషుల్ని మాత్రమే నమ్ముతాను” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ఇండస్ట్రీ గుట్టు రట్టు చేయబోతోందా?

అయితే ఒక అభిమాని మాత్రం.. అక్క మీరు ఎందుకు సపరేట్ గా బ్లాగ్ చేయాలని అనుకుంటున్నారు? అందులో ఎలాంటి ఐడియాస్ ని మీరు పోస్ట్ చేయబోతున్నారు? అని ప్రశ్నించగా.. అందుకు సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అనసూయ. ఇక సదరు అభిమాని అడిగిన ప్రశ్నను.. “నా మనసులో కొన్ని తీవ్రమైన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి పురుషులను ప్రశంసించి, మహిళలను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అలాగే ఆడ , మగ అనే తేడా టాలీవుడ్ లో ఎక్కువగా చూపిస్తున్నారు. ఇది లింగ వివక్షపూరితం కాదా.. స్త్రీ పురుషుల మధ్య తేడాను స్పష్టంగా చూపించడం పై ఇక్కడ నా గొంతును విప్పబోతున్నాను. ముఖ్యంగా తెలుగులో బయట వారిని ఆరాధిస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదు. అసలు టాలీవుడ్ లోనే ఎందుకు ఈ వివక్షత చూపిస్తున్నారు? అనే విషయంపై నా అభిప్రాయాలను నేను బయట పెట్టబోతున్నాను. ముఖ్యంగా గోతికాడ నక్కలు ఎవరో చెప్పబోతున్నాను అంటూ చివరిలో IYKYK అని ఒక వరుడును జోడించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

ALSO READ:Harsha Vardhan: ఇంటికి తాళం వేస్తే గానీ దొంగలను మార్చలేము.. అనసూయకు హర్షవర్ధన్ స్ట్రాంగ్ కౌంటర్!

స్వీయ అనుభవాలే బ్లాగ్ లో చేరనున్నాయా?

IYKYK ఈ పదాన్ని సోషల్ మీడియాలో సాధారణంగా ఒక జోక్ చెప్పినప్పుడు లేదా ఏదైనా కష్ట పూరిత అనుభవాల గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు.. ఉదాహరణకు ఏదైనా సమస్య గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ సమస్యను అనుభవించిన వారికే బాగా తెలుస్తుంది అని చెప్పడానికి ఈ పదం వాడతారు. ఇక దీన్ని బట్టి చూస్తే అనసూయ తనకు ఇండస్ట్రీలో ఎదురైన విషయాలను ఇక్కడ చెప్పబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి కొంతమంది ఇండస్ట్రీ గుట్టు రట్టు చేస్తోంది కాబోలు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి అనసూయ తన కొత్త బ్లాగులో ఎలాంటి విషయాలు బయటపెడుతుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×