E-Paper
Advertisement

Big TV Kissik Talks: కన్నతండ్రినే దూరం పెట్టిన శ్రీ సత్య.. చివరికి?

Big TV Kissik Talks: కన్నతండ్రినే దూరం పెట్టిన శ్రీ సత్య.. చివరికి?
Advertisement

Big TV Kissik Talks:శ్రీ సత్య.. క్యూట్ లుక్స్ తో .. సింప్లీ స్మైల్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ బయటకు ఎంతో సంతోషంగా కనిపించినా.. లోపల మాత్రం చాలా నరకమే అనుభవించింది. ఈ విషయాన్ని గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పుడు తన బాధను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది . పైకి సంతోషంగా కనిపించే శ్రీ సత్య (Sri Satya) మనసులో ఇంత దుఃఖం ఉందా అని తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. మధ్యలో షోలు అంటూ సందడి చేసిన శ్రీ సత్య.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

కన్నతండ్రినే దూరం పెట్టిన శ్రీ సత్య..

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరొకవైపు టీవీ సీరియల్స్ తో ఇప్పుడు డిజిటల్ కంటెంట్ ఇస్తూ.. డాన్స్ షోలు, ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్స్ తో బిజీగా మారిన ఈమె.. తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న “కిస్సిక్ టాక్స్” కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి గెస్ట్ వచ్చిన శ్రీ సత్య ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే తన తండ్రినే దూరం పెట్టిన విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. శ్రీ సత్య మాట్లాడుతూ..” నేను తెలిసి తెలియని వయసులో ఒక వ్యక్తిని ప్రేమించాను. అయితే అతడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అడిగినప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు.. ఇక అతడి కోసం.. అతడితో పెళ్లి కోసం మా నాన్నను ఒప్పించడానికి ఏడాది పాటు నేను మా నాన్నతో మాట్లాడలేదు. కానీ ఆ బాధను తట్టుకోలేక మా నాన్న నా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యింది . కానీ అతడు నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఇక ఆ నరకం నుంచి బయటపడడానికి నాకు చాలా సమయం పట్టింది ” అంటూ శ్రీ సత్య చెప్పుకొచ్చింది.

Advertisement

also read:Tollywood: ఫౌజీ సినిమా ఖచ్చితంగా హిట్ అవాల్సిందే.. టాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్..!

జీవితాంతం ఉండేది కన్న తల్లిదండ్రులే -శ్రీ సత్య

ఇకపోతే అతడి కోసం ఏడాదికి పైగా తన కన్న తండ్రిని దూరం పెట్టిన ఈమె అతడు దూరం అయిన తర్వాత తన తండ్రి తనకు అండగా నిలిచారు అని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” ఒక వ్యక్తి కోసం నా కన్నతండ్రిని నేను దూరం పెట్టాను. కానీ అతడు దూరమయ్యాకే మా నాన్న విలువ నాకు మరింత తెలిసింది. ఏ రిలేషన్ షిప్ లో అయినా సరే జీవితాంతం తోడుగా ఉండేది కన్న తల్లిదండ్రులు మాత్రమే. ఏది నిజం కాదు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది శ్రీ సత్య. ఇక ప్రస్తుతం శ్రీ సత్య చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన తల్లి అనారోగ్యం గురించి, తండ్రితో దూరంగా ఉండడం గురించి, బ్రేకప్, సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలా పలు విషయాలపై స్పందించింది శ్రీ సత్య ప్రస్తుతం శ్రీ సత్యకు సంబంధించిన ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×