E-Paper
Advertisement

PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!

PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!
Advertisement

PM Narendra Modi:  రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ పర్యటన ఉండవచ్చని అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో రూ.వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటు, మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, శంకుస్థాపనలు చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రాజధాని హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, కేంద్రం తెలంగాణకు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, తేదీలు ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశాలున్నట్లు వినికిడి.

Also Read: Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే!

దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై హైకోర్టులో పిటిషన్

Advertisement

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం పార్టీ మారలేదని స్పీకర్ తీర్పునివ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని కోరారు. 2024లో ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరుపున పోటీ పచేశారని, కాబట్టి ఎమ్మెల్యేగా దానం తీసుకున్న జీతాన్నిఇ వెనక్కి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కాగా దీనిపై ఈనెల 23న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read: Food Safety Crisis: వరుసగా వెలుగు చూస్తున్న కల్తీ ఆహారపదార్థాలు.. మామూళ్ల మత్తులో జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×