E-Paper
Advertisement

Kissik Talks: తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష పడాలి.. ‘లా’ పై లయ అసహనం

Kissik Talks: తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష పడాలి.. ‘లా’ పై లయ అసహనం
Advertisement

Kissik Talks: చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరినైనా సరే ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టేవారికి వెంటనే శిక్షపడాలని, అసలు బెయిల్ అనేది ఇవ్వకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నటి లయ (Actress Laya). ఆమె నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ (Sampradayini Suppini Suddapoosani) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. సినిమా వివరాలతో పాటు అనేక విషయాలపై ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా భార్యభర్తల మధ్య తగాదాలపై మాట్లాడుతూ.. ‘‘భార్యభర్తల మధ్య తగాదాలలో అసలు దూరకూడదు. ఎందుకంటే, చివరికి వారిద్దరూ ఒకటే అవుతారు. మనమే పిచ్చిమోహాలం అవుతాం. నా వరకు నా భర్తతో గొడవ వచ్చే సందర్భం అంటే.. ‘నువ్వు టవల్ ఎందుకు ఇక్కడ పెట్టావ్. నేను కొత్తిమీర తీసుకురమ్మంటే కరివేపాకు తెచ్చావేంటి?’.. ఇలాంటివే మా మధ్య వచ్చే ఫైట్స్’’ అని లయ చెప్పారు.

Also Read- Actress Laya: శివాజీ, అనసూయ కాంట్రవర్సీపై లయ షాకింగ్ కామెంట్స్

‘లా’ చాలా కఠినంగా ఉండాలి

Advertisement

ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల్ని, ముసలివాళ్లని.. ఏజ్‌తో సంబంధం లేకుండా ఫిజికల్‌గా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు కదా.. అలాంటి వారికి మీరు ఎలాంటి శిక్ష వేస్తారని అడిగితే.. ‘‘ఇలాంటి విషయాల్లో ‘లా’ చాలా కఠినంగా ఉండాలి. అదే సమయంలో ఫాస్ట్‌గా ప్రాసెస్ అవ్వాలి. అసలు నా బాధే అది.. ఎందుకంత టైమ్ ఇస్తున్నారు. అలాంటి ఘటనలకు పాల్పడే వారికి బెయిల్ వెంటనే రాకూడదు. 10, 15 సంవత్సరాలు అయిన తర్వాత జస్టిస్ వచ్చినా ఏం ఉపయోగం.. వాళ్లు సగం జీవితం బతికేసినట్లే కదా. తప్పు చేసి కూడా వారు అంతకాలం జీవించి ఉన్నారంటే, ‘లా’ కఠినంగా లేనట్టేగా. ఇలాంటి వాటిపై వెంటనే శిక్షలు అమలు చేస్తే.. తప్పు చేయాలనుకునే వారు భయపడతారు. లేదంటే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి’’ అని లయ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read- Kissik Talks: తెలుగు ప్రేక్షకులను వదిలివెళ్లను, కానీ.. నటి లయ ప్రామిస్!

వారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే..

Advertisement

రీ ఎంట్రీపై ఆమె స్పందిస్తూ.. ‘‘నేను ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నాను.. మళ్లీ చెబుతాను.. ఈ రోజు ఇక్కడకు వచ్చి, నేను ఇలా సినిమాలు చేస్తున్నా, లేదంటే ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నా.. అదంతా నా భర్త సపోర్ట్ ఉండటం వల్లే చేయగలుగుతున్నాను. నిజంగా, అసలు ఇలా వద్దని నా ఫ్యామిలీ తరుపు వారు ఎవరైనా చెప్పినా కూడా, నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. నిజంగా ఎవరైనా చెప్పి ఉంటే మాత్రం ఆగిపోయేదాన్ని. ఎందుకంటే, నాకు నా భర్త, పిల్లలే ఫస్ట్. వారి తర్వాతే ఏదైనా. కానీ, నా ఈ జర్నీకి వారంతా ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు’’ అని లయ తెలిపారు.

Also Read- Monalisa Bhosle Wedding:  ఫైనల్లీ ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఫోటోలు వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×