E-Paper
Advertisement

Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి.. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి..  కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Advertisement

Mangalhat Police:  విశ్వసనీయ సమాచారంతో మంగళ్‌హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా మంగళ్‌హాట్ పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాజా మాంసమని నమ్మిస్తూ, కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మంగళ్‌హాట్ లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ఏ టూ జెడ్ మటన్ షాపు పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నఅమర్ నగర్ కు చెందిన మహమ్మద్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడగా, అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: Arjun Kalyan: బిబి జోడి 2 పై అర్జున్ కళ్యాణ్  కామెంట్స్..అంత వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందా?

300 కిలోలీ కుళ్లిన గొర్రె, మేక మాంసాన్ని స్వాధీనం

Advertisement

నిందితుడి నుంచి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు 300 కిలోలీ కుళ్లిన గొర్రె, మేక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుండి తక్కువ ధరకే మాంసాన్ని కొనుగోలు చేసే వాడని, ఆ మాంసాన్ని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉంచేవాడని పోలీసులు తెలిపారు. మాంసం కుళ్ళిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయించేవాడని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఆపరేషన్ లో గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, అడిషనల్ డీసీపీ బి. కృష్ణ గౌడ్, మంగళ్‌హాట్ ఇన్ స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, ఎస్.ఐ లు వినోద్, శ్రుతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Arjun Kalyan: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి అదే కారణమా.. అసలు మ్యాటర్ చెప్పిన అర్జున్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×