E-Paper
Advertisement

Big TV Kissik Talks: లవ్ ఫెయిల్యూర్ అని ప్రాణాలు తీసుకునే వారికి లయ క్లాస్!

Big TV Kissik Talks: లవ్ ఫెయిల్యూర్ అని ప్రాణాలు తీసుకునే వారికి లయ క్లాస్!
Advertisement

Big TV Kissik Talks: లవ్ ఫెయిల్యూర్ అయిందని జీవితాన్ని త్యాగం చేసుకోవాలనుకునే వారికి లయ (Actress Laya) హితోపదేశం చేశారు. తాజాగా ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లవ్ ఫెయిల్యూర్ (Love Failure) అయిన వాళ్లు తీసుకునే డెసిషన్స్ తప్పని, ఆ టైమ్‌లో ఎలా ఆలోచించాలో ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై ఆమె మాట్లాడుతూ..

Also Read- Kissik Talks: చుట్టూ బ్యాడ్ పీపుల్ ఉన్నారు.. మనం తట్టుకోలేని ఇష్యూ ఇది!

తొందరపాటు నిర్ణయాలు వద్దు..

Advertisement

‘‘లవ్ ఫెయిల్యూర్ వంటివి చాలా డిఫరెంట్ టాపిక్స్. డిస్కస్ చేసుకుంటూ ఉంటే అంతం అనేది ఉండదు. మీ పేరేంట్స్ ఇచ్చే లవ్ కంటే.. వేరే వాళ్లు ఇచ్చేది ఏదో ఒక రీజన్ వల్ల వర్కవుట్ అవ్వలేదు. కొంతమందికి పెళ్లి అయిన తర్వాత వర్క్ అవ్వకపోవచ్చు. కొంతమంది ఈగోకి పోయి పాడు చేసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా.. ఇంకా దానిని బాగుచేసుకోగలమేమో చూసుకోండి. అది ఇంక నాకు అవ్వదు, ఈ రిలేషన్‌షిప్ నాకు పెయిన్ ఇస్తుందంటే అలా పట్టుకుని కూర్చోవద్దు.. వదిలేయండి. లవ్ ఫెయిల్యూర్ అని.. డిప్రెషన్‌కి వెళ్లడం, చనిపోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. అసలు ఆ ఆలోచనే మంచిది కాదు. పేరేంట్స్‌ని మాత్రమే కాదు, ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వాళ్లందరినీ హర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు కానీ, అది నిజం కాదు. ఆవేశంలో అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.. కానీ కొద్దిగా ఓపిక పడితే, రెండు మూడు రోజుల్లో ఆ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. అలా కాదు, అంటే మీ పెయిన్‌ని మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. క్షణకాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

Also Read- Actress Laya: కెరీర్ వదిలేసి, 24 ఏళ్లకే పెళ్లి చేసుకోవడానికి కారణం అదే!

అది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు

Advertisement

మన రిలేషన్‌షిప్‌ని మనం బాగుచేసుకోగలం అనుకుంటే చేసుకోవచ్చు.. ఒకవేళ చేసుకోలేకపోయినా, పట్టుకుని వేలాడవద్దు. మన మూవ్ ఆన్ అయిపోతే.. అదర్ పర్సన్ అయినా హ్యాపీగా ఉంటారు కదా. కాబట్టి దానిని వదిలేసి, మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్‌పై పెట్టండి. లవ్ ఫెయిల్యూర్ అనేది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ కాదు. ఇంకొకరు మంచి వారు దొరకవచ్చు. మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? ఎదుటి పర్సన్ బ్యాడ్ కాకపోవచ్చు, అతను మనకు సెట్ కాకపోవచ్చు. మిస్ అండర్‌స్టాండింగ్ కావచ్చు. ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, పక్కవాళ్ల మాటలు కావచ్చు.. వర్క్ అవ్వకపోవడానికి ఇలా చాలా కారణాలు ఉంటాయి. అవేంటనేది తెలుసుకుని, క్లారిటీ తెచ్చుకుని, మీకేం కావాలో చూసుకుని.. దాని ప్రకారం వెళ్లండి. ఎవరినీ హర్ట్ చేయవద్దు.. నిన్ను నువ్వు కూడా హర్ట్ చేసుకోవద్దు’’ అని లయ చెప్పుకొచ్చారు.

Also Read- Laya Kissik Talks: బ్లైండ్ పాత్ర చేస్తే.. ఫస్ట్ వీక్ కోటి లాస్ అన్నారు.. థర్డ్ వీక్ కోటి లాభం అన్నారు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×