E-Paper
Advertisement

Haier vs Samsung Fridges: సమ్మర్ కోసం.. ఈ రెండు ఫ్రిడ్జ్‌లలో.. ఏది కొంటే బెటర్?

Haier vs Samsung Fridges: సమ్మర్ కోసం.. ఈ రెండు ఫ్రిడ్జ్‌లలో.. ఏది కొంటే బెటర్?
Advertisement

Haier vs Samsung Fridges: ప్రస్తుతం మార్కెట్ లోని మధ్య శ్రేణి రిఫ్రిజిరేటర్లలో రెండు మోడల్స్ ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హైయర్, శాంసంగ్ కంపెనీలకు చెందిన ‘Haier  325 L 3 Star Double Door’, ‘Samsung 322 L 3 Star Double Door’ మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది. 3-5 సభ్యులు ఉన్న కుటుంబాలకు ఈ ఫ్రిడ్జ్ లు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. దీంతో ఈ రెండింటిలో సమ్మర్ కోసం ఏ ఫ్రిడ్జ్ కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటువంటి వారి కోసం ఈ కథనం అందించడం జరుగుతోంది. ఈ రెండు రిఫ్రిజిరేటర్ల మధ్య ఉన్నముఖ్యమైన తేడాలను ఫీచర్ల వారీగా పరిశీలించండి.

డిజైన్ పరంగా చూస్తే..

హైయర్ ఫ్రిడ్జ్.. బాటమ్ మౌంట్ (Bottom Mount) డిజైన్‌తో వస్తుంది. అంటే ఇందులో ఫ్రీజర్ కింద భాగంలో.. మనం తరచుగా వాడే ఫ్రిడ్జ్ విభాగం పైన ఉంటుంది. దీనివల్ల కూరగాయలు లేదా పాలు తీసుకోవడానికి పదే పదే వంగాల్సిన అవసరం ఉండదు. ఇది వృద్ధులకు లేదా వెన్నునొప్పి సమస్యలు ఉన్నవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మరోవైపు శాంసంగ్ (Samsung) టాప్ మౌంట్ (Top Mount) డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సాంప్రదాయ పద్ధతిలో ఫ్రీజర్ పైన ఉంటుంది. మీకు పాతకాలపు అలవాటు ప్రకారం ఫ్రీజర్ పైన ఉండటం ఇష్టమైతే శాంసంగ్ బెస్ట్ ఛాయిస్.

కూలింగ్ టెక్నాలజీ

Advertisement

శాంసంగ్ ఇందులో తన పేటెంట్ Twin Cooling Plus టెక్నాలజీని అమర్చింది. ఇది ఫ్రిజ్, ఫ్రీజర్ విభాగాలకు విడివిడి కూలింగ్ అందిస్తుంది. దీనివల్ల ఆహార పదార్థాల వాసనలు ఒకదానికొకటి కలవకుండా ఉంటాయి. అలాగే తేమ శాతం (70%) ఎక్కువగా ఉండి కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అటు హైయర్ మోడల్ ఫ్రిడ్జ్ Triple Inverter & Dual Fan టెక్నాలజీతో రూపొందింది. ఇది కంప్రెసర్, ఫ్యాన్ వేగాన్ని లోడ్ కి తగ్గట్టుగా సర్దుబాటు చేసి విద్యుత్ ఆదా చేస్తుంది. అంతే కాకుండా గంటలోనే ఐస్ తయారు చేసేలా వేగవంతమైన కూలింగ్‌ను అందిస్తుంది.

కన్వర్టబుల్ మోడ్స్

ఫ్లెక్సిబిలిటీ విషయంలో హైయర్ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో 14-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. అంటే మీ ఇంట్లో జరిగే పార్టీలు లేదా పండగలకు తగ్గట్టుగా ఫ్రిజ్ లోని వివిధ భాగాలను రకరకాలుగా సెట్ చేసుకోవచ్చు. శామ్‌సంగ్ 5-in-1 కన్వర్టిబుల్ ఆప్షన్‌ను అందిస్తుంది. ఇందులో నార్మల్, ఎక్స్‌ట్రా షాపింగ్, వెకేషన్, సీజనల్, హోమ్ అలోన్ అనే ఐదు మోడ్స్ ఉంటాయి. తక్కువ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. ఇవి సగటు వినియోగదారుడికి సరిపోతాయి.

వారంటీ, మన్నిక

Advertisement

దీర్ఘకాలిక వినియోగం, నమ్మకం విషయానికి వస్తే శాంసంగ్ స్పష్టం పైచేయి సాధిస్తోంది. శాంసంగ్ తన డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ మీద ఏకంగా 20 సంవత్సరాల వారంటీని ఇస్తోంది. ఇది పరిశ్రమలోనే అత్యధికం. హైయర్ తన ఫ్రిడ్జ్ కంప్రెసర్ మీద 10 సంవత్సరాల వారంటీని మాత్రమే ఇస్తుంది. మీరు పదే పదే ఫ్రిజ్‌లు మార్చకుండా ఒకసారి కొంటే రెండు దశాబ్దాల పాటు భరోసా ఉండాలనుకుంటే శాంసంగ్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

బడ్జెట్ పరంగా చూస్తే..

ధర పరంగా చూస్తే సాధారణంగా శాంసంగ్ కంటే హైయర్ కొంచెం తక్కువ ధరకు, మెరుగైన ఆఫర్లలో లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, ఆధునిక బాటమ్ మౌంట్ డిజైన్, ఎక్కువ కన్వర్టిబుల్ మోడ్స్ కావాలనుకునే వారికి హైయర్ ‘Value for Money’ అనిపిస్తుంది. అయితే మెరుగైన బ్రాండ్ విలువ, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, సుదీర్ఘ వారంటీని కోరుకునే వారు కొంచెం అదనపు ధర చెల్లించి అయినా శాంసంగ్ ను ఎంచుకుంటారు.

Also Read: YSRCP vs TDP: టీడీపీని ఇరికించిన ఎంపీ.. వైసీపీ చేతికి మరో అస్త్రం.. ఔరా హతవిధి!

ఓవరాల్‌గా ఏది బెటర్?

మీరు వంగి వస్తువులు తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే లేదా ఆధునిక డిజైన్ కావాలనుకుంటే Haier వైపు వెళ్లండి. దీని బాటమ్ మౌంట్ డిజైన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. మీకు దీర్ఘకాలిక భరోసా (20 ఏళ్ల వారంటీ), మెరుగైన బ్రాండ్ సర్వీస్ కావాలంటే Samsung ఎంచుకోండి. ఇది మార్కెట్లో చాలా నమ్మకమైన మోడల్. బడ్జెట్ పరంగా చూస్తే రెండూ దాదాపు ఒకే ధరలో ఉన్నాయి కానీ ఆఫర్లను బట్టి హైయర్ కొంచెం తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

Also Read: Viral Video: స్కూల్ ఈవెంట్‌లో.. విద్యార్థినుల అర్ధనగ్న స్టెప్పులు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ముఖ్య గమనిక: శాంసంగ్, హైయర్ ఫ్రిడ్జ్ ల మధ్య వ్యత్యాసాలను సదరు కంపెనీలు విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. ఫ్రిడ్జ్ ల ఫీచర్లకు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×