E-Paper
Advertisement

నన్ను ఎదగకుండా తొక్కేశారు.. నాడు దీనస్థితిపై విశ్వ ఎమోషనల్!

నన్ను ఎదగకుండా తొక్కేశారు..  నాడు దీనస్థితిపై విశ్వ ఎమోషనల్!
Advertisement

Actor Vishwa:ఒకప్పుడు సీరియల్స్ లో నటించి.. ఆ తర్వాత సినిమాల ద్వారా వెండితెర ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విశ్వ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విశ్వ .. కొంతకాలం క్రితమే సీరియల్స్ మానేసి ఇండస్ట్రీకి దూరంగా.. “విశ్వ ఫిట్నెస్ క్లబ్ ” ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్ గా మారారు. ఇకపోతే దీని విలువ సుమారుగా 50 కోట్ల పైమాటే. సొంత కష్టార్జితంతో ఈ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్ గా కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్న ఈయనకు తాజాగా రామ్ చరణ్ , బుచ్చి బాబుసన కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో అవకాశం లభించింది. దీంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసారు విశ్వ. ఈ నేపథ్యంలోనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీలో తనపై జరిగిన కుట్ర, అలాగే తాను ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, తన భార్యతో ప్రేమ పెళ్లి ఇలా పలు విషయాలను పంచుకున్నారు.

ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారు – విశ్వ

అందులో భాగంగానే విశ్వ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 24 సంవత్సరాలవుతోంది..ముఖ్యంగా పదవ తరగతి అయిపోయిన వెంటనే పరిశ్రమలోకి వచ్చాను. పెళ్లి కోసం విద్యార్థి వంటి పలు చిత్రాలలో నటించిన నేను.. ఆ తర్వాత సీరియల్స్ చేయడం మొదలు పెట్టాను. దీనికి కారణం అక్కినేని నాగార్జున.. ఆయన ప్రొడక్షన్లో సీరియల్ అంటే ఇక ఎంత పెద్ద సీరియలో అర్థం చేసుకోవచ్చు. ఆయన ద్వారానే నేను సీరియల్స్ కి వచ్చాను. అయితే కొంతకాలంగా సీరియల్స్ కూడా మానేశాను.. ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాను. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు ..

తమ్ముడి సంపాదన పైనే బ్రతికాను -విశ్వ

Advertisement

ఇక దాంతో నా తమ్ముడి సంపాదన పైనే నేను ఆధారపడ్డాను.. దాదాపు 6 నెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టం వస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాము. ఎప్పుడైనా పని వాళ్లు రాకపోతే గిన్నెలు కూడా కడిగాము.. రేషన్ బియ్యం తిన్న రోజులు కూడా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాన్ని తనకు అవకాశాలు రాకుండా తొక్కేయాలని చూసిన విధానాన్ని అలాగే తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకుంటూ..ఆవేదన వ్యక్తం చేశారు విశ్వ.

also read:తండ్రయిన స్టార్ హీరో.. ఏం పేరు పెట్టారో తెలుసా?

భార్య శ్రద్ధతో ప్రేమ, పెళ్లి..

Advertisement

అలాగే తన భార్యతో ప్రేమ , పెళ్లి గురించి మాట్లాడుతూ..” సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధ పడిపోతూ ఉండేవాడిని. అదే సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. అలా నాకు కనెక్ట్ అయిపోయింది. వారం రోజులకే ప్రేమ విషయం చెప్పి పెళ్లి ప్రపోజల్ పెట్టేసింది. మొదట శ్రద్ధ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, నా గురించి తెలిశాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె నా కోసం దేవుడు పంపిన ఒక ఏంజెల్ అని భావిస్తాను” అంటూ భార్యపై తన ప్రేమను కురిపించారు విశ్వ.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×