E-Paper
Advertisement

పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, మరింత చౌకగా అందుబాటులోకి!

పల్సర్ లవర్స్ కు గుడ్ న్యూస్, మరింత చౌకగా అందుబాటులోకి!
Advertisement

Bajaj Pulsar NS400Z Launch Soon: బజాజ్ ఆటో తాజాగా డొమినార్ 400ను అప్‌ డేటెడ్ చేయగా, ఇప్పుడు మరో పాపులర్ మోడల్ ను కొత్త ఇంజన్ తో తీసుకురాబోతోంది. కొత్త బజాజ్ పల్సర్ NS400Z పేరుత మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఈ బైక్‌ లో పెద్ద మార్పు ఏమిటంటే, ఇంతకుముందు ఉన్న ఇంజన్ స్థానంలో ఇప్పుడు 349cc ఇంజన్‌ ను ఉపయోగించనున్నారు. ఈ ఛేంజ్ తో బైక్‌ పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ఈ మోడల్ దేశ వ్యాప్తంగా కొన్ని డీలర్‌ షిప్‌ లకు చేరడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బైక్ త్వరలోనే అధికారికంగా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

కొత్త పల్సర్ ధర తగ్గుతుందా?

ధర విషయానికి వస్తే, ఈ కొత్త NS400Z ఎక్స్ షోరూమ్ ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే, వినియోగదారులకు ముఖ్యమైన విషయం ఆన్ రోడ్ ధర. ఈ ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కారణం, 350cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్‌ లకు ఇన్సూరెన్స్ ఖర్చులు తగ్గనున్నాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విషయంలో, 350cc పైబడిన బైక్‌లతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు తక్కువగా ఉంటుంది. ఇది కొత్త బైక్‌ ను కొనాలనుకునే చాలా లాభం కలిగిస్తుంది.

కొత్త ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజన్ పరంగా చూస్తే, ఈ బైక్‌ లో 349cc లిక్విడ్ కూల్డ్ యూనిట్ ఉంటుంది. ఇది సుమారు 40bhp పవర్, 33Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌ తో పోలిస్తే పవర్, టార్క్ స్వల్పంగా తగ్గినప్పటికీ, డ్రైవింగ్  ఎక్స్ పీరియెన్స్ లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. అయితే, టార్క్ ఇప్పుడు కొంచెం ఎక్కువ rpm దగ్గర అందుతుంది. అంటే, బైక్‌ ను కొంచెం ఎక్కువ రేస్ చేస్తేనే పూర్తి పనితీరు తెలుస్తుంది. ఇది స్పోర్టీ రైడింగ్ ఇష్టపడే వారికి బాగానే అనిపించవచ్చు, కానీ, సాధారణ వినియోగదారులకు కొద్దిగా భిన్నంగా అనిపించే అవకాశం ఉంది.

డిజైన్ లో నో ఛేంజెస్..

డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త NS400Zలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇదివ రకు ఉన్న మోడల్‌ లో ఉన్న స్టైలింగ్, బాడీ డిజైన్ అలాగే కొనసాగుతుందని భావిస్తున్నారు. అలాగే బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ లాంటి ముఖ్య భాగాలు కూడా మారకుండా ఉండే అవకాశం ఉంది. అంటే, బైక్ మొత్తం లుక్, ఫీల్ పెద్దగా మారకపోయినా, ఇంజన్ మార్పుతో కొంత కొత్త అనుభవాన్ని ఇస్తుంది.

Advertisement

కొత్త బజాజ్ పల్సర్ NS400Z తక్కువ ఆన్ రోడ్ ఖర్చుతో, మంచి పనితీరు కలిగిన బైక్‌ గా మార్కెట్ లో సత్తా చాటనుంది.  ఇప్పటికే డీలర్‌ షిప్‌ లకు చేరుతున్న నేపథ్యంలో, బజాజ్ ఈ బైక్‌ను త్వరలోనే అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో మిడ్ రేంజ్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌ లో పోటీ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also: ఓర్ని.. హ్యూందాయ్ i10 కారును ఇలా మార్చేశారా? వీడియో చూస్తే షాకవుతారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×