E-Paper
Advertisement

మంగ్లీ కేసులో భారీ ట్విస్ట్.. నిందితుడు మధు అరెస్ట్?

మంగ్లీ కేసులో భారీ ట్విస్ట్.. నిందితుడు మధు అరెస్ట్?
Advertisement

Mangli Case: ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli)కి మైక్రో ఫైనాన్స్ కేసులో సంబంధం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో బిగ్ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కీలక నిందితుడిగా ఉన్న మధు అరెస్టు అయ్యారు. మియాపూర్ పోలీసులు మధుని అదుపులోకి తీసుకోవడం జరిగింది.. అరెస్టు కావడంతో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా మంగ్లీ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ప్రధాన నిందితుడు మధు అరెస్ట్..

ముఖ్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ లో మంగ్లీని చూసి పెట్టుబడులు పెట్టామని హిమాకాంత్ రెడ్డి అంటుంటే.. మరొకవైపు నిందితుడు మధు మాత్రం అసలు ఈ కేసుతో మంగ్లీ కి సంబంధమే లేదు అని పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా మధు ఒక వీడియోని కూడా విడుదల చేశారు.. అయితే ఇప్పుడు మరో కొత్త వీడియోని మధు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ” నేను హిమాకాంత్ రెడ్డిని గురువుగా భావించాను. సరిత బాధితురాలు కాదు.. హిమాకాంత్ రెడ్డి , సరిత, సుబ్బు ముగ్గురు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.. నేనెక్కడికి పారిపోలేదు. త్వరలోనే మీడియా ముందుకు వస్తాను. ఒక్కొక్కటి బండారం బయట పెడతాను. హిమాకాంత్ మాట నమ్మి నేను దారుణంగా మోసపోయాను. సరితను అరెస్టు చేసి అడిగితే అసలు విషయాలు అన్నీ బయటపడతాయి” అంటూ మధు స్పష్టం చేశారు. ఇక తనకు ఏ పాపం తెలియదని మంగ్లీ చెప్పడమే కాదు మధు నన్ను కలిసింది నిజమే కానీ బిజినెస్ కు సంబంధించిన ఏ విషయాలు నాకు తెలియదు అంటూ మంగ్లీ తెలిపింది. మంగ్లీ ప్రమేయం లేకపోయినా ఆమె పేరును ప్రస్తావిస్తూ ఈ కేసులో ఇరికించడం సంచలనంగా మారింది.

ఆ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తి అతనే – మధు

Advertisement

ఇకపోతే ఈ 150 కోట్లకు కుంభకోణం వెనుక అసలు వ్యక్తులు హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపిస్తున్నారు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడు అని, అటు అడ్వకేట్ సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులని, హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని కూడా మధు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మరి దీనిపై ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.

ALSO READ:కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎంకి లేఖ రాసిన మోనాలిసా?

కన్నీటి పర్యంతమైన మంగ్లీ..

Advertisement

150 కోట్ల భారీ స్కామ్ అంటూ వస్తున్న మైక్రో ఫైనాన్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రమేయం లేకపోయినా తన పేరును చేర్చి తనను, తన తమ్ముడిని, తన కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే .. జైలు జీవితం గడపడానికి కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేసింది. అటు మధు కూడా ఇందులో మంగ్లీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేయడం గమనార్హం. మరి ఈ విషయం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×