// // Best Smart Electric Scooters: హైటెక్ ఈ-స్కూటర్లు.. టచ్ డిస్‌ ప్లేతో వచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే! -->
E-Paper
Advertisement

హైటెక్ ఈ-స్కూటర్లు.. టచ్ డిస్‌ ప్లేతో వచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే!

హైటెక్ ఈ-స్కూటర్లు.. టచ్ డిస్‌ ప్లేతో వచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే!
Advertisement

Smart Electric Scooters with Touchscreen:  భారత మార్కెట్‌ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు తమ స్కూటర్లను మరింత ఆధునికంగా తయారు చేస్తున్నాయి. టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లేలు ఇప్పుడు ఈ స్కూటర్లలో కీలక ఫీచర్‌ గా మారాయి. ఇవి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడమే కాకుండా, స్మార్ట్‌ ఫోన్‌ లాంటి ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తాయి. ప్రస్తుతం టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లేలు ఉన్న టాప్ 5  ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టీవీఎస్ ఐక్యూబ్

ప్రస్తుతం మంచి ఆదరణ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఒకటి. ఇది కంపెనీ టాప్ వేరియంట్. 7 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్‌ తో వస్తుంది. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్‌, నావిగేషన్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్‌ లా లాంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభించే ఈ స్కూటర్, గరిష్టంగా 200 కి.మీకి పైగా రేంజ్ ఇస్తుంది.

⦿ ఓలా S1 ప్రో జెన్ 3

Advertisement

ఓలా S1 ప్రో జెన్ 3.. 7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ తో వస్తుంది. ఇందులో SOS అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉంటాయి. అదనంగా, యాప్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

⦿ ఏథర్ రిజ్టా

ఏథర్ రిజ్టా కూడా 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ డాష్‌ బోర్డ్ ఉంటుంది. వాడటం చాలా సులభం. ఇందులో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, స్కిడ్ కంట్రోల్, ఫాల్ అలర్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ ప్రయాణానికి  అనుకూలంగా ఉంటుంది.

⦿ సింపుల్ వన్

Advertisement

సింపుల్ వన్ మరో అడ్వాన్స్‌ డ్ స్కూటర్. ఇందులో కూడా 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్ నావిగేషన్, కాల్ అలర్ట్‌,  లైవ్ లొకేషన్ షేరింగ్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ స్కూటర్ రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

⦿ ఏథర్ 450X

ఏథర్ 450X మంచి పనితీరు, స్మూత్ యూజర్ ఇంటర్‌ ఫేస్‌ తో ప్రసిద్ధి చెందింది. టచ్, స్క్రోల్ సపోర్ట్‌ తో పాటు అలెక్సా ఇంటిగ్రేషన్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ కూడా ఇస్తుంది.

Read Also: యమహా లవర్స్‌ కు గుడ్ న్యూస్.. ఫాసినో హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది!

మొత్తంగా టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే లు ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత స్మార్ట్‌ గా మార్చుతున్నాయి. ఇవి కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, టెక్నాలజీ ఎక్సపీరియెన్స్ ను కూడా అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఫీచర్లు మరింత విస్తరించే అవకాశం ఉంది.

Read Also:టీవీఎస్ ఐక్యూబ్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 15,500 తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×