E-Paper
Advertisement

Chiranjeevi: దశాబ్దాల నిరీక్షణ.. అవార్డు స్వీకరణ.. యువ హీరోలకు కష్టకాలమే: చిరంజీవి

Chiranjeevi: దశాబ్దాల నిరీక్షణ.. అవార్డు స్వీకరణ.. యువ హీరోలకు కష్టకాలమే: చిరంజీవి
Advertisement

Chiranjeevi: ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా.. ఇప్పుడు సరైన సమయంలోనే నాకు ఇచ్చారని భావిస్తున్నా.. అంటూ “ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022” అవార్డు అందుకున్నారు చిరంజీవి. అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా నిలిచే అవార్డుల్లో ఇదొకటి అన్నారు.

“45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చింది. అప్పుడే సినిమా విలువేంటో మరింత తెలిసింది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ, చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం. ప్రేక్షకుల ప్రేమకు దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా” అంటూ చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.

Advertisement

ఈ సందర్భంగా గతాన్ని ప్రస్తావించారు చిరంజీవి. ‘గతంలో చలన చిత్రోత్సవ వేడుకలకు ఓసారి వచ్చా. దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని చాలా బాధపడ్డా. ఇప్పుడు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’ అన్నారు చిరంజీవి.

గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు చిరంజీవి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×