E-Paper
Advertisement

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు
Advertisement

Mudragada Kranthi: ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ముద్రగడ సంతాప సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడ కూతురు క్రాంతి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని కడసారి చూపు చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

కాపు నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన అంత్యక్రియల్లో జరిగిన రభస నుంచి నోరు విప్పారు ముద్రగడ కూతురు క్రాంతి. అంతేకాదు సంతాప సభలు పెట్టడంపై విరుచుకుపడ్డారు. జనం గుండెల్లో ఉన్నవారు నాన్న రాజకీయ వారసురాలు అవుతారని తేల్చిచెప్పారు. అంతేకాదు ఆయన చేసిన ప్రతీ పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తామే ముద్రగడ వారసులమని ప్రతీ ఊరికి స్టేజీ మీద చెబితే జరిగే పని కాదన్నారు. ఆయనెంత త్యాగాలు చేశారో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల కోసం ఆయన ప్రతీదానిని త్యాగం చేశారన్నారు. చివరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

నాన్నలా వారంతా చేస్తారా?

Advertisement

ముద్రగడ అంత్యక్రియల్లో జరిగిన ఓవరాక్షన్ పై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ వారసులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. అది నేనైనా కావచ్చు, లేకుంటే మా అన్న-తమ్ముడైనా కావచ్చన్నారు. నాన్నకు నేనంటే పంచప్రాణాలని, నాన్న సమాధికి కన్నీటితో నివాళులు అర్పిస్తానని కంటతడి పెట్టారు. ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె, కీలక విషయాలు వెల్లడించారు. నాన్న అంత్యక్రియల్లో పొలిటికల్ మైలేజీ కోసం వైసీపీ నేతలంతా వచ్చారన్నారు. నాన్న మరణం తర్వాత నాలుగు రోజులు మాట్లాడతారని ఆ తర్వాత సైలెంట్ అయిపోతారని చెప్పుకొచ్చారు. ఆయన మాదిరిగా ప్రజల కోసం ఎవరు నిలబడతారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

పదవులకు రాజీనామా చేస్తారా?-క్రాంతి

ముద్రగడ మాదిరిగా ఎవరైనా పేరు మార్చుకుంటారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఏనాడూ నాన్నని జగన్ గౌరవించిన సందర్భం లేదని కుండబద్దలు కొట్టేశారు. గడిచిన మూడు ఎన్నికల్లో నాన్నకు సీటు ఇవ్వలేదన్నారు. ప్రత్తిపాడు వచ్చి సీటు ప్రకటన చేశారని, కావాల్సిస్తే వీడియోలు చూడాలన్నారు. అంత్యక్రియల్లో నాన్న అభిమానులను ఎవర్నీ పిలవలేదన్నారు. వైసీపీ నేతలు, క్యాడర్ మాత్రమే వచ్చినట్టు తెలిపారు. సంతాప సభలో వైసీపీ నేతల తప్ప ఎవరూ కనిపించలేదన్నారు. జనసేన తన ప్రయాణం సాగిస్తానని తేల్చిచెప్పారు ముద్రగడ క్రాంతి. రాజకీయాల్లోకి అన్నింటికి ప్రిపేర్ అయి వచ్చానన్నారు. వైసీపీకి సపోర్టు చేయకుండా జనసేనకు సపోర్టు చేయడమే ఆరోజు తనను దూరంగా పెట్టారని మనసులోని మాట బయటపెట్టారు ముద్రగడ క్రాంతి.

Advertisement

ALSO READ: స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×