E-Paper
Advertisement

FarmHouse Case : కేసీఆర్‌పై రివర్స్ పిటిషన్.. హైకోర్టుకు తుషార్..

FarmHouse Case : కేసీఆర్‌పై రివర్స్ పిటిషన్.. హైకోర్టుకు తుషార్..
Advertisement

FarmHouse Case : ఫాంహౌజ్ కేసు అటూఇటూ తిరుగుతోంది. ఓసారి సిట్ ది అప్పర్ హ్యాండ్ అయితే, ఇంకోసారి నిందితులది. హైకోర్టు స్టే తో కేసులో కీలకమైన బీఎల్ సంతోష్ ప్రస్తుతానికైతే సేఫ్. అయితే, డిసెంబర్ 5 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. ఇంతలోనే మరో ఆసక్తికర పరిణామం.

సిట్ నోటీసులపై కేరళకు చెందిన తుషార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది మామూలు విషయమే అయినా.. పిటిషన్ లో కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తుషార్.

Advertisement

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ కేసులో సిట్‌ విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.

ఈ నెల 21న విచారణకు రావాలని 41ఏ సీఆర్‌పీసీ కింద తనకు నోటీసు ఇచ్చారని.. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్‌ చేసినట్టు పిటిషన్ లో వివరించారు. అయితే, మెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా తనపై లుకౌట్‌ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందన్నారు తుషార్‌.

Advertisement

సిట్ నోటీసులు అందుకున్న తుషార్, జగ్గుస్వామిలు ఇప్పటి వరకూ విచారణకు హాజరు కాలేదు. వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండగా.. తుషార్ ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం, నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేయడం, సీబీఐ విచారణకు డిమాండ్ చేయడంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోననే టెన్షన్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×