E-Paper
Advertisement

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!
Advertisement

MouthPad Device: చేతులతో సంబంధం లేకుండా కేవలం నాలుకతోనే కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది ఓ అమెరికన్ కంపెనీ. వైకల్యం వంటి శారీరక సమస్యలు (Mobility challenges) ఉన్నవారి కోసం ‘ఆగ్మెంటల్’ (Augmental) అనే సంస్థ ఓ అద్భుత పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘మౌత్‌ప్యాడ్’ (MouthPad). ఎలాంటి సర్జరీలు అవసరం లేకుండా డిజిటల్ పరికరాలను సులభంగా నియంత్రించేలా దీనిని రూపొందించారు. ఈ వినూత్న సాంకేతికతకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

అసలేంటీ మౌత్ ప్యాడ్?

మౌత్‌ప్యాడ్ అనేది అత్యంత తేలికైన, చిన్న సాంకేతిక పరికరం. కేవలం 10 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ సాధనం.. నోటి పైభాగంలో (అంగిలి) సరిగ్గా అమరిపోతుంది. యూజర్ల పళ్ల డెంటల్ స్కాన్ ఆధారంగా దీనిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇది ప్రెజర్ సెన్సిటివ్ పరికరం కావడం వల్ల.. నాలుకతో ఇచ్చే చిన్నపాటి టచ్ ను కూడా సులభంగా గుర్తిస్తుంది.

Advertisement

ఇదిలా ఎలా పనిచేస్తుంది?

ఈ మౌత్ ప్యాడ్ పరికరం ప్రధానంగా మూడు రకాల కదలికలతో పనిచేస్తుందని ‘ఆగ్మెంటల్’ తెలిపింది. నాలుకతో అంగిలిపై నొక్కడం (Tongue Presses) ద్వారా క్లిక్ లేదా ఎంటర్ చేయవచ్చని పేర్కొంది. గాలిని లోపలికి పీల్చడం (Sip Gestures) ద్వారా స్క్రీన్ ఆపరేట్ చేయవచ్చని చెప్పింది. అలాగే తల కదలికల (Head Tracking) ద్వారా కర్సర్‌ను స్క్రీన్ పై కదల్చడం వంటివి చేయవచ్చని స్పష్టం చేసింది.

Advertisement

7 గంటల బ్యాటరీ లైఫ్..

ఈ మౌత్ ప్యాడ్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 7 గంటలకు పైగా నిరంతరాయంగా పనిచేయనుంది. విండోస్, మ్యాక్ (macOS), లినక్స్, ఆండ్రాయిడ్, ఐఫోన్ (iOS) వంటి అన్ని ప్రముఖ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది.

బ్రెయిన్ ఇంప్లాంట్స్‌కు గట్టి పోటీ!

తయారీ సంస్థ ఆగ్మెంటల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరికరాన్ని ఉపయోగించిన ఒక వ్యక్తి సెకనుకు 10.47 బిట్స్ (10.47 bits per second) వేగాన్ని అందుకున్నారు. సర్జరీల ద్వారా మెదడులో అమర్చే క్లిష్టమైన ‘బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (BCI) పరికరాలు అందించే కర్సర్ కంట్రోల్ వేగానికి ఇది ఏమాత్రం తీసిపోదని అగ్మెంటల్ ప్రతినిధులు తెలిపారు. ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ స్థాయి వేగాన్ని అందించడం దీని ప్రత్యేకతగా పేర్కొన్నారు.

ఇంతకీ ధర ఎంతంటే?

ప్రస్తుతం ఈ మౌత్ ప్యాడ్ ధరను 1,400 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.1.16 లక్షలు. దీంతో పాటు డెంటల్ స్కాన్ కోసం మరో 50-150 డాలర్ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే లభిస్తున్న ఈ పరికరం కోసం ఇప్పటికే 6,300 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఆర్డర్ చేసిన తర్వాత చేతికి అందడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది.

Also Read: పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

100 మంది వినియోగం..

అయితే ఈ మౌత్ ప్యాడ్ ను ఇప్పటికే 100 మందికి పైగా కొనుగోలు చేసి.. వాడుతున్నట్లు ఆగ్మెంటల్ సంస్థ ప్రకటించింది. వారు తమ రోజువారీ జీవితంలో ఈ మౌత్‌ప్యాడ్‌ను ఉపయోగిస్తూ తమ డిజిటల్ అవసరాలను తీర్చుకుంటున్నట్లు తెలిపింది. చేతులు ఉపయోగించకుండా కేవలం నాలుకతో కంప్యూటర్‌ను నియంత్రించే ఈ కొత్త సాంకేతికత.. భారత్ లో అందుబాటులోకి వస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

Big Stories

Advertisement
×