E-Paper
Advertisement

Spider Robot Construction: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Spider Robot Construction: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!
Advertisement

Spider Robot 24 Hours Construction| ప్రపంచంలో ఇళ్ల కొరత, పర్యావరణ కాలుష్యం – ఈ రెండు పెద్ద సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపిస్తున్న ఒక అద్భుత టెక్నాలజీ వచ్చేసింది. ఇది ఒక పెద్ద సాలీడు రూపంలో ఉండే రోబోట్.. దీని పేరు “షార్లెట్”. ఈ రోబోట్ ఒక్క రోజు కూడా పూర్తి కాకముందే అంటే 24 గంటల్లోపు పెద్ద ఇల్లు మొత్తాన్ని నిర్మించేస్తుంది. మరో విశేషమేమిటంటే.. ఇంటి నిర్మాణం కోసం ఈ రోబోట్ సిమెంట్, ఇటుకలు ఏమీ ఉపయోగించదు. స్థానికంగా లభించే మట్టి, ఇసుక, శుభ్రమైన పాడైన వ్యర్థాలతోనే గోడలు 3D ప్రింట్ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో “క్రెస్ట్ రోబోటిక్స్” అనే కంపెనీ ఈ రోబోట్‌ను తయారు చేసింది. మనుషుల సాయం లేకుండానే ఈ రోబోట్ తనంతట తానుగా పని చేస్తుంది. లేయర్ లేయర్‌గా మెత్తని మిక్స్‌చర్‌ రెడీ చేసి గోడలు పైకి ఎత్తుతుంది. ఇల్లు నిర్మించడానికి ట్రక్కుల్లో సిమెంట్, ఇసుక తెచ్చే అవసరం లేదు. అందుకే కార్బన్ కాలుష్యం భారీగా తగ్గుతుంది. సాధారణంగా ఇటుకలు, సిమెంట్ తయారు చేయడంలో చాలా విద్యుత్, ఇంధనం ఖర్చవుతాయి. షార్లెట్ ఈ ఖర్చులన్నీ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో నిర్మాణం చేస్తుంది.

వేగంగా నిర్మాణం పూర్తి

Advertisement

వేగంగా నిర్మాణం చేయడం దీని అసలు ప్రత్యేకత. 100 మంది మిస్త్రీలు కలిసి చేసే పనిని ఒక్క రోబోట్ ఒక్క రోజులో పూర్తి చేస్తుంది. రాత్రింబవళ్లు ఆపకుండా పని చేస్తుంది కాబట్టి ఇళ్లు చాలా త్వరగా తయారవుతాయి. దీని కాళ్లు ఉండడం వల్ల కొండలు, గుంతలు, అడవుల్లో కూడా సులభంగా నడుస్తుంది. చక్రాల యంత్రాలు ఇరుక్కుపోయే చోట కూడా ఇది సమస్య లేకుండా పని చేస్తుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో, కూలీలు లభించని ప్రదేశాల్లో ఇళ్లు కట్టడం సాధ్యమవుతుంది.

మనుషుల ఉద్యోగాలకు ముప్పు

ఇంత త్వరగా, ఇంత తక్కువ ఖర్చుతో ఇళ్లు కట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల కొరత తగ్గుతుంది. ధర కూడా చాలా తక్కువ అవుతుంది. కానీ ఒక సమస్య ఉంది. మనుషుల ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. క్రెస్ట్ కంపెనీ ప్రకారం.. “ప్రమాదకరమైన, ఒకేలా ఉండే పనులు రోబోట్ చేస్తుంది. మనుషులు మరింత నైపుణ్యం ఉన్న పనులు చేయవచ్చు” అని. అయినా కూలీలు, మిస్త్రీల అవసరం ఉండదు కాబట్టి వారి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. దీనికి పరిష్కారంగా వారికి నైపుణ్యం ఉన్న కొత్త శిక్షణ ఇవ్వడం, రోబోట్‌లను నడపడం-మరమ్మత్తు చేయడం వంటి కొత్త ఉద్యోగాలు సృష్టించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రుడిపై ఇంటి నిర్మాణం

Advertisement

ఈ రోబోట్‌తో చంద్రుడిపై కూడా ఇళ్లు కట్టడానికి ఉపయోగించాలనే యోచనలో ఉన్నారు. తేలికగా, బరువు తక్కువగా ఉండడంతో దీన్ని మడతపెట్టి ఉంటుంది. చంద్రుడిపై ఉన్న మట్టిని (రెగోలిత్) వాడుకొని గట్టి ఇళ్లు నిర్మించవచ్చని పరిశోధకులు చెబున్నారు. అంటే భవిష్యత్తులో చంద్రుడిపై కాలనీలు కట్టడం కూడా సాధ్యమవుతుంది.

మొత్తం మీద షార్లెట్ రోబోట్ నిర్మాణ రంగాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఇళ్లు త్వరగా, తక్కువ ధరలో, పర్యావరణానికి హాని చేయకుండా నిర్మించే అవకాశం ఉంది.

Also Read: దొంగలను పట్టించే ఏఐ టెక్నాలజీ.. షావోమీ కొత్త డోర్ లాక్ వచ్చేసింది..

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×