E-Paper
Advertisement

Huawei MatePad Edge: అబ్బా ఏముంది హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్.. 14.2 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలతో లాంచ్!

Huawei MatePad Edge: అబ్బా ఏముంది హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్.. 14.2 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలతో లాంచ్!
Advertisement

Huawei MatePad Edge: ప్రముఖ చైనా బ్రాండ్ హువావే తన శక్తివంతమైన టాబ్లెట్ మేట్‌ప్యాడ్ ఎడ్జ్‌ను తమ మార్కెట్‌లోకి దించింది. ఇది 14.2-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్ల్పేను కలిగి ఉంది. అలాగే ఈ మేడ్‌ప్యాడ్ ఎడ్జ్ కిరిన్ X90A చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ టాబ్లెట్‌కు 32జీబీ వరకు RAM, 2టీబీ వరకు అంతర్గత నిల్వను అందించారు. ఈ మేట్‌ప్యాడ్ ఎడ్జ్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి..

కలర్స్, ధర విషయానికొస్తే..

ఈ టాబ్లెట్ 16జీబీ + 256జీబీ స్టోరేజీ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.76,వేల నుండి ప్రారంభమవుతుంది. అలాగే.. 16జీబీ + 512జీబీ స్టోరేజీ కలిగిన వేరియంట్ సుమారు రూ.82 వేలు, 24జీబీ ర్యామ్+ 1టీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగిన టాబ్లెట్ ధర సుమారు రూ.101,000గా ఉంది. ఇకపోతే.. టాప్-ఎండ్ మోడల్ 32జీబీ ర్యామ్+ 2టీబీ స్టోరేజీ వేరియంట్ కలిగిన టాబ్లెట్ ధర సుమారు రూ.164,000గా ఉంది. హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్ ఆల్రెడీ చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్పేస్ గ్రే, మూన్‌లైట్ సిల్వర్‌లో రంగుల్లో ఈ టాబ్లెట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Read Also: మరోసారి భారీ డిస్కౌంట్.. అమెజాన్‌ సేల్లో రూ.9వేల తగ్గింపుతో 5జీ ఫోన్!

అద్భుతమైన ఫీచర్లు..

హువావే టాబ్లెట్ 14.2-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది 3,120×2,080 పిక్సెల్ రిజల్యూషన్, 1,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఈ పరికరానికి కిరిన్ X90A చిప్‌సెట్ ద్వారా శక్తి లభిస్తుంది. ఇకపోతే, 32జీబీ వరకు ర్యామ్, 2టీబీ వరకు అంతర్గత నిల్వతో వస్తుంది. టాబ్లెట్ హార్మొనీ ఆపరేటింగ్ సిస్టమ్ 5.1పై నడుస్తుంది.

12,900 ఎంఏహెచ్ బ్యాటరీ..

Advertisement

ఇకపోతే.. ఈ హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఈ టాబ్లెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉంది. ముందు భాగంలో, టాబ్లెట్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇకపోతే ఈ హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్ 12,900mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.

Read Also: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×