E-Paper
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురిసే అవకాశం
తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. అలాగే కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో భిన్న వాతావరణం..
మరోవైపు తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర చలి.. అలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు చంద్రబాబు భూమి పూజ

తీరప్రాంత ప్రజలకు అలెర్ట్..
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే బయటకు రాకూడదని హెచ్చరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×