E-Paper
Advertisement

క్వాంటం రాజధానిగా అమరావతి.. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం రాజధానిగా అమరావతి.. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Advertisement

Amarawati Quantum Valley Launch: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని భారత దేశపు క్వాంటం రాజధానిగా (Quantum Capital of India) అభివర్ణించారు. దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యాక్సెస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించారు. అమరావతి 1ఎస్ (Amarawati 1S), అమరావతి 1క్యూ (Amarawati 1Q) అనే రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం (SRM University), మేధా టవర్స్ (Maidha Towers) వేదికలుగా ఆయన జాతికి అంకితం చేశారు. కేవలం ఏడు నెలల స్వల్ప కాలంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన కొనియాడారు.

క్వాంటం సాంకేతికత అనేది కేవలం ఒక పరికరం మాత్రమే కాదని, ఇది రాబోయే కాలంలో అన్ని ఫ్రంటియర్ టెక్నాలజీలకు తల్లి వంటిదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడుకునేదని, భవిష్యత్తులో క్వాంటం వ్యాలీ (Amarawati Quantum Valley) గురించి మాట్లాడుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం టిఐఎఫ్ఆర్ (TIFR), ఐఐఎస్సీ (IISc), ఐఐటీలు, డిఆర్డిఓ (DRDO) వంటి ప్రముఖ జాతీయ సంస్థలతో పాటు దేశీయ స్టార్టప్‌లు ఏకతాటిపైకి వచ్చి ఒక శక్తిగా పనిచేశాయని ఆయన వివరించారు.

Advertisement

రాష్ట్రంలోని యువతను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాస్, ఐబిఎం (IBM) వంటి సంస్థల భాగస్వామ్యంతో దాదాపు 45 లక్షల మంది యువతకు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెక్యూరిటీ, డీప్ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 1.04 లక్షల మంది విద్యార్థులు ఐఐటీ మద్రాస్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడం వారి ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ క్వాంటం కేంద్రాలు కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా, క్వాంటం హార్డ్‌వేర్ తయారీకి (Hardware Manufacturing) పునాది వేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా, భారత్ తన సొంత క్వాంటం కంప్యూటర్లను నిర్మించుకునే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలో ఐబిఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు భవన నిర్మాణం జరుగుతోందని, ఈ ఏడాది చివరి నాటికి అది అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, డీఎస్టీ సెక్రటరీ అభయ్ కరందీకర్ తదితర ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Read Also: ఏఐకి గురువులుగా మారండి.. వేలల్లో సంపాదించండి.. టెక్ రంగంలో సరికొత్త ట్రెండ్

Related News

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

Big Stories

Advertisement
×