E-Paper
Advertisement

Bajaj Dominar 350cc: డొమినార్ ఇప్పుడు చీప్.. కొత్త ఇంజన్‌తో బజాజ్ సర్ప్రైజ్!

Bajaj Dominar 350cc: డొమినార్ ఇప్పుడు చీప్.. కొత్త ఇంజన్‌తో బజాజ్ సర్ప్రైజ్!
Advertisement

Bajaj Dominar 350cc Version Launched: బజాజ్ తన పాపులర్ స్పోర్ట్స్ టూరర్ బైక్ డొమినార్ శ్రేణిలో కొత్త మార్పులతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈసారి కంపెనీ డొమినార్ 400 మోడల్‌ లో ఇంజన్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ కొత్త వెర్షన్‌ ను పరిచయం చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు 350cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇంజన్ పవర్ తగ్గినప్పటికీ, పనితీరు విషయంలో మంచి పొజిషన్ లోనే ఉందని కంపెనీ వెల్లడించింది.

కొత్త మోడల్ ధర తగ్గించిన డొమినార్

ఈ కొత్త మోడల్ ధర కూడా కొంత తగ్గింది. ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 2.03 లక్షలుగా నిర్ణయించింది. ఇది పాత 400cc వేరియంట్‌ తో పోలిస్తే దాదాపు రూ. 37,000 తక్కువ. ధర తగ్గడానికి ప్రధాన కారణం చిన్న ఇంజన్ కారణంగా GST రేటు తగ్గి బైక్ ధర కూడా తగ్గింది. ఈ బైక్ ధర తగ్గడంతో చాలా మంది కొనుగోలుదారులకు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తగ్గిన ఇంజిన్ సామర్థ్యం

Advertisement

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త డొమినార్‌లో 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9,000 rpm దగ్గర సుమారు 40 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్‌ ను ఇస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌ బాక్స్ ఉంటుంది. మొత్తంగా చూస్తే, ఇది రోజువారీ వినియోగంతో పాటు హైవే రైడింగ్‌కు కూడా సరిపడే పనితీరు ఇస్తుంది.

పాత 373cc ఇంజన్‌ తో పోలిస్తే ఈ కొత్త ఇంజన్ కొంచెం చిన్నదే అయినా, పవర్ డెలివరీ మాత్రం బలంగా ఉండేలా ట్యూన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అందువల్ల, పనితీరు విషయంలో పెద్దగా తగ్గుదల అనిపించకపోవచ్చు. అదనంగా, ఈ బైక్ బరువు కూడా కొంత తగ్గింది. పాత మోడల్‌ తో పోలిస్తే సుమారు 3 కిలోల వరకు తక్కువగా ఉంది. ఇది రైడింగ్ సమయంలో మరింత సులభంగా హ్యాండిల్ చేయడానికి సహాయపడుతుంది.

డిజైన్ పరంగా నో ఛేంజ్

Advertisement

డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. డొమినార్‌ కు ప్రత్యేకమైన మస్క్యులర్ లుక్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ఆకట్టుకునే హెడ్‌ లైట్ డిజైన్ యథాతథంగా కొనసాగుతున్నాయి. అలాగే ఫీచర్లలో కూడా పెద్దగా మార్పులు లేవు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్ లాంటి ఫీచర్లు ముందులాగే అందుబాటులో ఉన్నాయి. బజాజ్ ఈ కొత్త 350cc డొమినార్‌ ను తీసుకురావడం ద్వారా తక్కువ ధరలో మంచి పనితీరు కలిగిన బైక్‌ను అందించాలనే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ధర తగ్గడంతో పాటు, బరువు తగ్గడం కూడా వినియోగదారులకు ప్లస్ పాయింట్ అవుతుంది. స్పోర్టీ లుక్‌ తో పాటు కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా మారనుంది.

Read Also: ఈవీ మార్కెట్‌ లో సంచలనం, ఓకే ఛార్జ్ తో 320 కిమీ వెళ్లే ఓలా స్కూటర్ వచ్చేసింది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×