E-Paper
Advertisement

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!
Advertisement

Vivo X500 Ultra Leak: టెక్ ప్రియుల్లో వివో కెమెరా ఫోన్లకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా అల్ట్రా సిరీస్ ఫోన్ల కెమెరా పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వివో తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Vivo X500 Ultra ఫోన్‌ను భారీ మార్పులతో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో ఏకంగా మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ట్రిపుల్ 200MP కెమెరా మాయాజాలం..

ఈ కొత్త ఫోన్ వెనుక భాగంలో మూడు 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లను వివో పరీక్షిస్తోందని సమాచారం. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం కానుంది. ఈ మూడు సెన్సార్లు వేర్వేరు ఆప్టికల్ సైజులతో రానున్నాయి. దీనివల్ల వినియోగదారులు ఎంత దూరంలో ఉన్న వస్తువులనైనా అత్యంత స్పష్టతతో, అద్భుతమైన జూమ్ సామర్థ్యంతో ఫొటోలు తీసుకోవచ్చు.

Advertisement

Also Read: ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

మునుపటి మోడల్‌కు మించి..

ఇటీవలే విడుదలైన వివో X300 అల్ట్రా ఫోన్‌కు ఇది సక్సెసర్‌గా వస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న X300 అల్ట్రా మోడల్‌లో 200MP ప్రైమరీ కెమెరాతో పాటు 6600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అగ్రశ్రేణి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే X500 అల్ట్రా అంతకుమించిన పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, మరింత మెరుగైన ఇమేజింగ్ టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

సిరీస్‌లో మరికొన్ని ఫోన్లు..

Advertisement

వివో కేవలం అల్ట్రా మోడల్‌కే పరిమితం కాకుండా.. ఈ సిరీస్‌లో మొత్తం 5 ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో వివో X500, X500 ప్రో, X500 ప్రో మాక్స్, X500e మోడళ్లు ఉండే అవకాశం ఉంది. వీటిలో X500 ప్రో మాక్స్ ఫోన్ 50MP సోనీ LOFIC ప్రైమరీ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరాతో ప్రొఫెషనల్ స్థాయి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందించనుంది.

సూపర్ ఫీచర్లతో ప్రో మోడల్..

మరోవైపు వివో X500 ప్రో మోడల్ కూడా భారీ అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌తో పాటు 6.37 ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 7000mAh కంటే పెద్ద బ్యాటరీని అందించబోతున్నట్లు టాక్. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7తో ఈ ఫోన్ పనిచేస్తుంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే అయినప్పటికీ.. ఈ లీకులు మొబైల్ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

Also Read: వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×