E-Paper
Advertisement

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు
Advertisement

Fire-Boltt Ninja 2 Max: ఈ రోజుల్లో స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైమ్ చూసే వాచ్ మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్, మన పర్సనల్ హెల్త్ అసిస్టెంట్. మార్కెట్లో వేలల్లో ధర పలికే స్మార్ట్‌వాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ, అతి తక్కువ బడ్జెట్‌లో, ప్రీమియం లుక్‌తో యూత్‌ని ఆకట్టుకోవడానికి వచ్చేసింది Fire-Boltt Ninja 2 Max. కేవలం రూ. 1,199 కే లభిస్తున్న ఈ వాచ్‌లో డిస్‌ప్లే నుంచి హెల్త్ ట్రాకింగ్ వరకు అన్నీ నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ కింగ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్రేజీ ఫీచర్స్.. సూపర్ లుకింగ్ స్మార్ట్‌వాచ్:

డిస్‌ప్లే :
ఫైర్-బోల్ట్ నింజా 2 మాక్స్ స్మార్ట్‌వాచ్‌లో 1.5 ఇంచుల ఫుల్ టచ్ హెచ్‌డీ డిస్‌ప్లే (240×280 పిక్సెల్స్ రిజల్యూషన్) ఇచ్చారు. స్క్రీన్ చాలా బ్రైట్‌గా , కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లినా సరే స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. పైగా, మీ రోజువారీ మూడ్‌కి తగ్గట్టు మార్చుకోవడానికి 200 కి పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అంటే రోజుకో కొత్త లుక్‌తో మీ ఫ్రెండ్స్ ముందు స్టైల్ చూపించొచ్చన్నమాట.

Advertisement

హెల్త్ ట్రాకింగ్ :
రూ. 1,199 కే ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

SpO2 మానిటర్: మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది.

Advertisement

హార్ట్ రేట్ మానిటరింగ్: 24/7 మీ గుండె వేగాన్ని గమనిస్తూ ఉంటుంది.

స్లీప్ ట్రాకర్: రాత్రి పూట మీరు ఎంతసేపు గాఢ నిద్రలో ఉన్నారు, మీ నిద్ర క్వాలిటీ ఎలా ఉందో చెప్తుంది.

ఇతర ఫీచర్స్: బ్లడ్ ప్రెజర్ మానిటర్, మెడిటేటివ్ బ్రీతింగ్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మెన్‌స్ట్రువల్ రిమైండర్ కూడా ఉన్నాయి.

స్పోర్ట్స్ లవర్స్‌కి పండగే:
మీరు ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే ఈ వాచ్ మీకు బెస్ట్ పార్టనర్ అవుతుంది. ఇందులో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి 20 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి, ఎన్ని అడుగులు వేశారు అనేది పక్కాగా కౌంట్ చేస్తుంది.

వాటర్ రెసిస్టెంట్ & బిల్డ్ క్వాలిటీ:
ఈ వాచ్‌కి IP68 రేటింగ్ ఉంది. అంటే.. చెమట పట్టినా, వర్షంలో తడిసినా, లేదా స్విమ్మింగ్ చేస్తున్నా ఈ వాచ్‌కి ఏమీ కాదు, డస్ట్ అండ్ స్వెట్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. దీని సిలికాన్ స్ట్రాప్స్ చాలా సాఫ్ట్‌గా ఉంటాయి, రోజంతా చేతికి పెట్టుకున్నా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్ :
స్మార్ట్‌వాచ్ కొనేటప్పుడు బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. Fire-Boltt Ninja 2 Max ఇందులో.. కూడా తోపు అనిపించుకుంది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే నార్మల్ యూసేజ్‌లో ఏకంగా 7 రోజుల పాటు బ్యాటరీ వస్తుంది. ఇక స్టాండ్‌బై టైమ్ అయితే 25 రోజుల వరకు ఉంటుంది. దీనికి తోడు.. మాగ్నెటిక్ చార్జర్ సపోర్ట్ ఉండటం వల్ల ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ 

స్మార్ట్ నోటిఫికేషన్స్:
మీ ఫోన్ జేబులో ఉన్నా సరే.. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా నోటిఫికేషన్లన్నీ మీ మణి కట్టుపైనే చూసుకోవచ్చు. అంతేకాకుండా.. ఫోన్ తీయకుండానే వాచ్ నుంచే కెమెరా షట్టర్ కంట్రోల్ చేయొచ్చు, మ్యూజిక్ కూడా ప్లే/పాజ్ చేసుకోవచ్చు.

కేవలం రూ. 1,199 బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, వారం రోజుల బ్యాటరీ లైఫ్, పవర్‌ఫుల్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌వాచ్ కావాలనుకుంటే.. Fire-Boltt Ninja 2 Max కళ్ళు మూసుకుని కొనేయొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్, తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ గ్యాడ్జెట్ ఆశించేవారికి ఇది మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×