E-Paper
Advertisement

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎలా గుర్తించాలి? డాక్టర్ చెప్పిన సంకేతాలివే

శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే ఎలా గుర్తించాలి? డాక్టర్ చెప్పిన సంకేతాలివే
Advertisement

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు సమతుల్యంగా ఉండాలి. అయితే విటమిన్స్ చాలా ముఖ్యమైనది విటమిన్ డి. ఇది ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యం, ఎనర్జీ లెవెల్స్ కూడా సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే చాలామంది విటమిన్ డి లోపం ప్రారంభ లక్షణాలను పట్టించుకోరు. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

1. ఎప్పుడూ అలసటగా అనిపించడం

తగినంత నిద్రపోయినా రోజంతా అలసటగా అనిపిస్తే అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. విటమిన్ డి తగ్గితే శరీర కణాలు, కండరాలు అవసరమైన శక్తిని సరిగా ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

2. కండరాల్లో బలహీనత

Advertisement

‘విటమిన్ డి’ లోపం వల్ల కండరాల బలం తగ్గుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు త్వరగా అలసిపోవచ్చు. ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేవడం కూడా కష్టంగా అనిపించవచ్చు. చాలామంది దీన్ని వయసు ప్రభావంగా భావిస్తారు. కానీ ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే పరీక్షలు చేయించుకోవాలి.

3. నడుము కింది భాగంలో నొప్పి

చాలా మంది నడుం నొప్పికి ఎప్పుడూ తప్పుడు భంగిమలో కూర్చోవడం కారణమని అనుకుంటారు. ‘విటమిన్ డి’ లోపం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. శరీరంలో కాల్షియం శోషణకు ‘విటమిన్ డి’ సహాయపడుతుంది. ఇది తగ్గితే ఎముకలు బలహీనపడతాయి. దీంతో నడుము భాగంలో నొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

4. తరచూ ఇన్‌ఫెక్షన్లు రావడం

Advertisement

విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తక్కువగా ఉంటే శరీరం వ్యాధులతో పోరాడే శక్తి తగ్గుతుంది. జలుబు, దగ్గు లేదా ఇతర ఇన్‌ఫెక్షన్లు తరచూ రావచ్చు. అలాగే కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టవచ్చు.

5. మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత తగ్గడం

విటమిన్ డి మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. ఈ విటమిన్ లోపిస్తే ఏకాగ్రత తగ్గుతుంది. బ్రెయిన్ ఫాగ్ సమస్య కనిపించవచ్చు. కొందరిలో మూడ్ మార్పులు కూడా వస్తాయి. దీర్ఘకాలం ఈ లోపం కొనసాగితే డిప్రెషన్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Also Read: రోజంతా కూర్చొని పనిచేసేవారిలో చెప్పుకోలేని ఆ ఒక్క ఆరోగ్య సమస్య తీవ్రం.. డాక్టర్ల హెచ్చరిక

లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎందుకు ముఖ్యం?

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమవుతుంది. రక్త పరీక్ష ద్వారా విటమిన్ డి స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు ఆహారంలో మార్పులు, ఎండలో కొంత సమయం గడపడం లేదా విటమిన్ డి సప్లిమెంట్లు సూచిస్తారు. వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

అలసట, కండరాల బలహీనత, నడుము నొప్పి లేదా తరచూ ఇన్‌ఫెక్షన్లు కొన్ని వారాల పాటు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ‘విటమిన్ డి’ లోపాన్ని సులభంగా నియంత్రించవచ్చు. అలాగే భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×