E-Paper
Advertisement

విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?

విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?
Advertisement

Vizianagaram Land: విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన MSME పార్క్ కోసం, భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టడంతో ఈ ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ భూమి కాదు..

గరివిడిలోని బాగువలస, వెదుళ్లవలస గ్రామాల పరిధిలో దాదాపు 21.8 ఎకరాల ప్రభుత్వ భూమిలో MSME పార్కు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇది ప్రభుత్వ భూమి కాదని, తమ సొంత భూమి అంటూ YCP నేత, మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు ఫ్యామిలీ నష్టపరిహారం కోరడంతో అసలు గుట్టు రట్టయింది. అంతేకాదు బాగువలసలోని ప్రభుత్వ భూములకు తమ్మినాయుడు నకిలీ పత్రాలు సృష్టించి.. వెబ్‌ల్యాండ్‌లో తన కుటుంబసభ్యుల పేరిట మార్పించుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Also read: జనాల తలరాత మారుస్తానన్న పూజారి.. తనే జైలుపాలయ్యాడు.. క్లైమాక్స్ మాములుగా లేదుగా!

రెవెన్యూ అధికారి పాత్ర..

2013 నుంచి 2019 మధ్య గరివిడి మండలంలో పనిచేసిన అప్పటి నలుగురు తహసీల్దార్ల అధికారిక లాగిన్ల ద్వారానే ఈ రికార్డుల మార్పిడి జరిగినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, కీలక రెవెన్యూ అధికారి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కనీసం ‘డీ-పట్టాలు’ లేకపోయినా.. సర్వే నెంబర్ 196-1లోని 6.64 ఎకరాలను తమ్మినాయుడు సోదరుల పేరిట విడివిడిగా మార్చేసి అడంగల్ పత్రాలు కూడా పొందారు.

దశాబ్దాలుగా తోటపంటలు..

Advertisement

సీన్ కట్ చేస్తే ఈ భూమిలో దశాబ్దాలుగా తోటపంటలు సాగు చేసుకుంటున్న రైతులు, రికార్డుల్లో వేరే వాళ్ల పేర్లు ఉండడం చూసి షాక్‌ అయ్యారు. న్యాయం చేయాలంటూ బాధితులంతా MLA కళా వెంకట్రావును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ల్యాండ్ స్కామ్‌కి సంబంధించిన ఫైల్ విజయనగరం జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. మొత్తానికి అక్రమాలకు సహకరించిన నలుగురు తహసీల్దార్లపై, భూమిని ఆక్రమించిన మాజీ సర్పంచ్‌పై కలెక్టర్ ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Storey By: Appa Rao Big Tv

Also read: రోడ్ ట్రిప్ వెళ్లే మజానే వేరబ్బా.. ఇండియా నుంచి రోడ్డు మార్గంలో వెళ్లగలిగే దేశాలివే

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×